డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు

డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ కేసును ఛేదించిన పోలీసులు
X

హైదరాబాద్‌కు చెందిన డెంటల్‌ డాక్టర్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. అనంతపురం జిల్లా పోలీసులు.. కిడ్నాపర్ల చెర నుంచి డాక్టర్‌ హుస్సేన్‌ను విడిపించారు. హైదరాబాద్‌లోని ఎక్సైజ్‌ కాలనీకి చెందిన డెంటల్‌ డాక్టర్‌ హుస్సేన్‌ను నిన్న రాత్రి కొంత మంది కిడ్నాప్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాక్టర్‌ను రక్షించి, ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్‌ చేశారు.

డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి అనంతపురం మీదుగా బెంగుళూరుకు తరలిస్తుండగా.. రాప్తాడులో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి మత్తు ఇంజక్షన్‌, గన్‌, కత్తి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గత రాత్రి బుర్కాలో వచ్చిన దుండగులు.. డాక్డర్‌ హుస్సేన్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. రాజేంద్రనగర్‌ పీఎస్ పరిధిలోని హిమాయత్‌ సాగర్‌ దర్గా వద్ద ఎక్సైజ్‌ అకాడమీ పక్కనున్న అపార్ట్‌మెంట్‌ నుంచి డాక్టర్‌ కిడ్నాప్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఠా తనను అరెస్ట్‌ చేసినట్లుగా డాక్టర్‌ చెబుతున్నారు.

Next Story

RELATED STORIES