నార్సింగి హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష!
రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి రూ.1000 జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించింది.

X
Vamshi Krishna9 Feb 2021 12:45 PM GMT
రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి రూ.1000 జరిమానాతో పాటు ఉరిశిక్ష విధించింది. నార్సింగి పీఎస్ పరిధిలో 2017లో ఆరేళ్ల బాలికపై నిందితుడు దినేశ్ కుమార్ అత్యాచారానికి పాల్పడి.. అనంతరం బండలతో కొట్టి హత్య చేశాడు. నాలుగేళ్ల విచారణ తర్వాత నిందితుడికి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సురేశ్ ఉరిశిక్ష విధించారు.
Next Story