Hyderabad: విదేశాల్లో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసినవారే టార్గెట్‌గా..

Hyderabad: విదేశాల్లో ఎమ్‌బీబీఎస్ పూర్తి చేసినవారే టార్గెట్‌గా..
Hyderabad: నకిలీ మెడిసిన్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ సీనియర్ అసిస్టెంట్‌, మరో ఇద్దరు నకిలీ వైద్యులు

Hyderabad: విదేశాల్లో MBBS పూర్తి చేసినవారికి ఇండియాలో ప్రాక్టీస్‌ కోసం నకిలీ మెడిసిన్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న మెడికల్‌ కౌన్సిల్‌ సీనియర్ అసిస్టెంట్‌సహా మరో ఇద్దరు నకిలీ వైద్యులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసి ఇండియాలో ప్రాక్టిస్ చేయాలంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యూయేట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

FMGE పరీక్షలో ఫెయిల్‌ అయినవారికి పాస్‌ అయినట్లు నకిలీ సర్టిఫికెట్లను సీనియర్ అసిస్టెంట్ అనంతకుమార్ విక్రయించిట్లు పోలీసులు నిర్దారించారు. ఒక్కో నకిలీ సర్టిఫికెట్ కోసం ఏకంగా 9 లక్షలు వసూలు చేసినట్లు తేల్చారు.

నిందితుడి అనంత్‌కుమార్ వద్ద నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసినవారు నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో విధుల్లో ఉన్నట్లు దృష్టికి వచ్చిందని అడిషనల్ సీపీ తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లతో వైద్యులుగా ఏపీలో ప్రాక్టీస్‌ చేస్తున్న మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నకిలీ సర్టిఫికెట్ల పట్ల అందరు జాగ్రత్తగా ఉండాలని అడిషనల్ సీపీ తెలిపారు. ఎలాంటి అనుమానం వచ్చినా.. ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story