కవలలకు జన్మనిచ్చిన తల్లి.. కూతుళ్లకు విషం తాగించిన తండ్రి

కవల కూతుళ్లు జన్మించారని తెలియగానే కనిపించకుండా పోయిన తండ్రి..హఠాత్తుగా హాస్పిటల్‌లో ప్రత్యక్షమయ్యాడు.

కవలలకు జన్మనిచ్చిన తల్లి.. కూతుళ్లకు విషం తాగించిన తండ్రి
X

మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి పట్టణంలో దారుణం జరిగింది. కూతుళ్లను చంపేందుకు తండ్రి ప్రయత్నించడం సంచలనంగా మారింది. మొదటి కాన్పులో కూతురు జన్మించగా... రెండో కాన్పులో కవల కూతుళ్లు పుట్టారు. ఇద్దరు కూతుళ్లకు తండ్రి పురుగుల మందు తాగించాడు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారులు మహబూబ్‌నగర్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

కవల కూతుళ్లు జన్మించారని తెలియగానే కనిపించకుండా పోయిన తండ్రి... హఠాత్తుగా హాస్పిటల్‌లో ప్రత్యక్షమయ్యాడు. చిన్నారుల వద్దకు వెళ్లి పురుగుల మందు తాగించాడు. పిల్లలకు నురగలు రావడంతో బంధువులు అప్రమత్తమయ్యారు. విష ప్రయోగం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు. చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. విషం కలపడం, పిల్లలకు తాగించడం సీసీ కెమెరాలో రికార్డయింది.

Next Story

RELATED STORIES