సరదా కోసం కొడుకుకు డీఎన్ఎ టెస్టు.. ఊహించని షాక్..!

సరదా కోసం కొడుకుకు డీఎన్ఎ టెస్టు.. ఊహించని షాక్..!
Father DNA test his Son: ఓ తండ్రి వీనోదం కోసం తన కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయించాడు. తీరా రిపోర్టు చూసి షాక్ తిన్నాడు.

Father DNA test his Son: ఎవరైనా సరదా కోసం ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తారు. టూర్ కి వెళ్తారు. కుదరకపోతే ఏదైనా హోటల్ కి వెళ్లి కడుపు నిండా తింటారు. కానీ, ఇక్కడ ఓ తండ్రి వీనోదం కోసం తన కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయించాడు. తీరా రిపోర్టు చూసి షాక్ తిన్నాడు. రిపోర్ట్ చూసిన అనంతరం ఆ తండ్రి నోటి వెంట మాటలు రాలేదు.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఉటాలో నివాసం ఉంటున్న డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులకు ఇద్దరు కుమారులు. వన్నెర్ జాన్సన్ 12 ఏళ్ల తరువాత వినోదం కోసం తన రెండవ కుమారునికి డిఎన్ఏ టెస్టు చేయించాలని నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నట్లుగానే సమీపంలో ఆస్పత్రికి వెళ్లి తన రెండో కుమారుడికి డీఎన్ఏ టెస్టు చేయించాడు. దాంతో వన్నెర్ జాన్సన్ కు ఊహించని అనుభవం ఎదురయ్యింది. డీఏన్ఏ నివేదికలో ఆ బాలుడు వారి కన్నకొడుకు కాదని తేలింది. ఐవీఎఫ్‌ సమయంలో ఫ్యూజన్‌(కలయిక)లో పొరపాటు చోటుచేసుకున్న కారణంగా ఈ సమస్య తలెత్తింది.

డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులు రెండవ సంతానం కోసం 2007లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) అంటే కృత్రిక గర్భధారణ విధానాన్ని ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో డోనా గర్భం దాల్చి కుమారునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలతో ఆ దంపతుల జీవితం హాయిగా సాగుతూ వచ్చింది. 12 ఏళ్ల తరువాత వన్నెర్ జాన్సన్ తన రెండవ కుమారునికి డీఎన్ఏ టెస్టు చేయించాడు. అంతే ఆ దంపతుల ఆనందం అంతా ఆవిరైపోయింది. ఈ రిపోర్టు చూసిన వన్నెర్ జాన్సర్ తన భార్యకు ఐవీఎఫ్ చికిత్స అందించిన క్లినిక్‌పై కేసు వేశారు.

వన్నెర్ జాన్సన్ తీసుకున్న రిపోర్టులో తన రెండవ కుమారుని తల్లి పేరు డోనా అని ఉండగా, తండ్రి ఎవరో తెలియదంటూ ఉంది. దీనిపై దర్యాప్తు చేపట్టగా, ఒక ఫ్యూజన్‌లో పొరపాటు చోటు చేసుకున్నదని తేలింది. డోనాకు సంబంధించిన అండం వేరొకరి వీర్యంతో ఫ్యూజన్ అయ్యిందని తేలింది. ఫలితంగా ఈ సమస్య తలెత్తిందని వెల్లడయ్యింది. ఇప్పుడు ఏంచేయాలో పోలుపోని స్థితిలో ఉన్నాడు వన్నెర్ జాన్సన్. సరదా కోసం వెళ్లి సమస్యలు తెచ్చుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story