విశాఖలో విషాదం.. లాడ్జిలో నలుగురు ఆత్మహత్యకు

విశాఖలో విషాదం.. లాడ్జిలో నలుగురు ఆత్మహత్యకు
X

విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలోని ఓ లాడ్జిలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడిన వారిని పెందుర్తి శివారు బంధుపాలెంకు చెందిన బి.అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు.

అప్పలరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల ఓ లాడ్జ్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పుల భారంతోనే భార్య మానస, కుమారుడు సాత్విక్‌ (5), కుమార్తె కీర్తి (6)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఉన్న సూసైడ్‌ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై అప్పలరాజు బంధువులకు ద్వారకానగర్‌ పోలీసులు సమాచారం అందించారు.

Next Story

RELATED STORIES