పనిమనిషిని హింసించి.. అన్నం పెట్టకుండా చంపేసి: పోలీస్ భార్య అమానుషం!

అందమైన సింగపూర్ సిటీలో ఆడవాళ్లెందుకు అంత కఠినంగా ఉంటారు.. పనిమనుషులను ఎందుకు అంత హీనంగా చూస్తారు. పని చేసుకోలేకపోతేనే కదా పని వాళ్లను పెట్టుకుంటారు.

పనిమనిషిని హింసించి.. అన్నం పెట్టకుండా చంపేసి: పోలీస్ భార్య అమానుషం!
X

అందమైన సింగపూర్ సిటీలో ఆడవాళ్లెందుకు అంత కఠినంగా ఉంటారు.. పనిమనుషులను ఎందుకు అంత హీనంగా చూస్తారు. పని చేసుకోలేకపోతేనే కదా పని వాళ్లను పెట్టుకుంటారు. చెప్పి చేయించుకోవాల్సింది పోయి వాళ్లని నానా రకాలుగా హింసించి వారి మరణానికి బాధ్యులవుతున్నారు.. కోర్టులకు ఎక్కుతున్నారు.. సింగపూర్ సిటీ సింప్లిసిటీకి మారు పేరనుకుంటారు. కానీ ఇక్కడ ఇళ్లలో పని చేసే వారిని హీనంగా చూస్తారు యజమానులు..

ఇళ్లలో పని చేసేందుకు ఇక్కడికి ఎక్కువగా మయన్మార్, ఇండోనేషియా, ఫిలిఫ్సైన్స్ దేశాల నుంచి వస్తారు. దాదాపుగా 2.50,000 మంది పని వారు అక్కడి నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక్కడ నివసించే ఓ పోలీస్ అధికారి భార్య గాయత్రి మురుగాయన్ పనిమనిషిని దారుణంగా హింసించి చంపేసిన ఘటనలో కోర్టులో ముద్దాయిగా నిలబడింది.

24ఏళ్ల పియాంగ్ గై డాన్ మయన్మార్ దేశం నుంచి వచ్చి 2015లో గాయత్రి ఇంట్లో పనికి కుదిరింది. ఆ తరువాతి ఏడాదికే గాయత్రి ఇంట్లో పని చేస్తున్న యువతి శవమై కనిపించింది. గాయత్రి, ఆమె తల్లి పనిమనిషిని తీవ్రంగా చిత్ర హింసలు పెట్టడంతో పియాంగ్ మరణించింది. చనిపోయేనాటికి 24 ఏళ్ల ఆ యువతి కేవలం 24 కిలోల బరువు మాత్రమే ఉంది. ఆమె ఇంట్లో పనికి కుదిరిన నాటి నుంచి పియాంగ్‌కి వేధింపులు ప్రారంభమయ్యాయి.

పియాంగ్ పని నెమ్మదిగా చేస్తుందని, శుభ్రత పాటించదని, ఆహారం ఎక్కువగా తింటుందని గాయత్రి ఆమెపై ఆరోపణలు చేస్తుండేది. కోర్టు గాయత్రి ఇంట్లోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించగా.. ఓ రోజు బాగా వేడెక్కిన ఇస్త్రీపెట్టెతో కూడా వాతలు పెట్టినట్లు తెలుస్తోంది. చాలా సార్లు నీటిలో ముంచిన రొట్టెను, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన ఆహారాన్ని, కొంచెం అన్నం మాత్రమే పెట్టి ఇంకా ఎంత తింటావ్ అని వేధించేదని కోర్టు విచారణలో తేలింది. పియాంగ్ 14 నెలల్లో 15 కిలోల బరువు కోల్పోయింది.

మెదడుకి తగినంత ఆక్సిజన్ అందక పియాంగ్ మరణించినట్లు వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. పనిమనిషి విషయంలో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన గాయత్రి దేవికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానాన్ని కోరారు. గాయత్రి భర్త కెల్విన్ చెల్వమ్‌తో పాటు ఆమె తల్లిపై కూడా అనేక అభియోగాలున్నాయి. అందుకే 2016లోనే పోలీస్ ఉద్యోగం నుంచి అతడిని సస్పెండ్ చేశారు. కాగా సింగపూర్‌లో పనిమనుషులపై వేధింపుల కేసులు కొత్త కాదు.

ఇంతకు ముందు అంటే 2017లో ఫిలిప్పైన్స్‌కి చెందిన ఓ పనిమనిషిని ఆకలితో మాడ్చిన నేరానికి ఒక జంటకు జైలు శిక్ష పడింది. అలాగే 2019 లో మరో పనిమనిషిని వేధించినందుకు గాను మరొకరికి జైలు శిక్షపడింది.

Next Story

RELATED STORIES