క్రైమ్

ప్రియురాలిపై గొడ్డలితో ప్రియుడి దాడి

ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడిచేశాడు.

ప్రియురాలిపై గొడ్డలితో ప్రియుడి దాడి
X

రంగారెడ్డిజిల్లా మీర్పేట్ పిఎస్ పరిధిలోని గుర్రం గూడలో దారుణం జరిగింది. టీచర్స్‌ కాలనీలో మాజీ ప్రియురాలు విమలపై రాహుల్ గౌడ్ అనే అతను అత్యంత దారుణంగా గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన విమల పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

గతంలో న్యూసెన్స్ కేసు పెట్టి తనను జైలుకు పంపించిందన్న కక్షతో రాహుల్ గౌడ్ దాడిచేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రాహుల్ కోసం నాలుగు బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు.


Next Story

RELATED STORIES