అర్థరాత్రి యువతిని ముళ్లపొదల్లో పడేసి..

X
Nagesh Swarna30 Oct 2020 3:24 AM GMT
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. 18 ఏళ్ల యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ముళ్లపొదల్లో పడేసి తప్పించుకోబోయాడు. ఇంతలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ వాహనానికి తారసపడ్డ యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. చేతులకు రక్తంతో ఉన్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఐతే.. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇల్లందులో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story