దారుణం.. యజమాని లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య

ఇంట్లో.. ఓ మైనర్‌ బాలిక పనిమనిషిగా చేస్తోంది. ఆమెతో పాటు తన చెల్లి కూడా అక్కడే ఉంటున్నారు. అయితే కొన్నాళ్లుగా యజమాని..

దారుణం.. యజమాని లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య
X

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని హిమాయత్ నగర్‌లో దారుణం జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలిక.. లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి సందర్శించి.. బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చారు. మధు యాదవ్‌ అనే వ్యక్తి ఇంట్లో.. ఓ మైనర్‌ బాలిక పనిమనిషిగా చేస్తోంది. ఆమెతోపాటు తన చెల్లి కూడా అక్కడే ఉంటున్నారు. అయితే కొన్నాళ్లుగా యజమాని మధు యాదవ్ లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో.. ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బాలిక మృతిపై గ్రామస్తులంతా ఒక్కటై ధర్నా చేశారు. బాలిక మృతికి కారణమైన మధుయాదవ్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని... ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన పలువురు నేతలు అన్నారు.

Next Story

RELATED STORIES