దారుణం.. బాలికను రేప్‌ చేసిన తండ్రీకొడుకులు?

గొయ్యి నుంచి బాలిక మృతదేహాన్ని తీసిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపించారు.

దారుణం.. బాలికను రేప్‌ చేసిన తండ్రీకొడుకులు?
X

ఉత్తరప్రదేశ్‌లో హథ్రాస్ ఘటనను తలపించే మరో దారుణం వెలుగుచూసింది. తల్లి, సోదరుడితో కలిసి పొలానికి వెళ్లిన బాలిక అదృశ్యమై.. చివరికి శవమై తేలింది. బులంద్‌షహర్‌ పట్టణ సమీపంలోని సిసౌరా గ్రామంలో ఈ ఘోరం జరిగింది. ఆరు రోజుల క్రితం 17 ఏళ్ల బాలిక.. తల్లి, సోదరితో కలిసి పొలానికి వెళ్లింది. దాహం తీర్చుకునేందుకు పొలం సమీపంలోని ఓ ఇంటికి వెళ్లింది. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో బాలిక కోసం కుటుంబసభ్యులు వెతికారు. బాలిక జాడ కనిపించకపోవడంతో ఫిబ్రవరి 25న కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విచారణ జరిపిన పోలీసులు.. బాలిక మృతదేహం తప్పిపోయిన అమ్మాయిదేనని గుర్తించారు. బాలిక తప్పిపోయిన ప్రదేశం నుంచి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఆమెను చంపేసి గొయ్యి తీసి పాతిపెట్టారు. గొయ్యి నుంచి బాలిక మృతదేహాన్ని తీసిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపించారు. బాలిక మృతదేహం వెలికితీసిన ఇంట్లో తండ్రీకొడుకులు ఉన్నారని, వారిలో తండ్రిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. కుమారుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు. బాలికపై అత్యాచారం చేసి చంపినట్లు బాధితురాలి కుటుంబం ఆరోపించింది. అటు పోలీసులు కూడా.. తండ్రి కొడుకులే బాలికపై అత్యాచారం చేసి, హతమార్చారని భావిస్తున్నారు.


Next Story

RELATED STORIES