తొలిరాత్రి పెళ్లి కొడుకు వింత ప్రవర్తన.. ఆ తర్వాతే అసలు విషయం బట్టబయలు

తొలిరాత్రి పెళ్లి కొడుకు వింత ప్రవర్తన.. ఆ తర్వాతే అసలు విషయం బట్టబయలు
Groom: అమ్మాయిని బాగా చూసుకుంటాడని అతనికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు పెద్దలు. పెళ్లైన తొలి రాత్రి నుంచి అతని వింత ప్రవర్తనలు, విచిత్ర ధోరణితో యువతి షాక్ తిన్నది.

అతనో ప్రభుత్వ ఉద్యోగి.. అమ్మాయిని బాగా చూసుకుంటాడని అతనికి ఇచ్చి ఘనంగా వివాహం చేశారు పెద్దలు. పెళ్లైన తొలి రాత్రి నుంచి అతని వింత ప్రవర్తనలు, విచిత్ర ధోరణితో యువతి షాక్ తిన్నది. ఏంటా అని నిలదీస్తే వింత సమాదానం చెప్పడంతో ఖంగుతిన్నది. అతని వింత ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకు చెబితే వారూ ఆశ్చర్యపోయారు. దాంతో అతడు తమను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని ఆ యువతి పోలీసు స్టేషన్‎లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన ఓ మహిళ తాడేపల్లిలోని గవర్నమెంట్ కార్యాలయంలో ఉద్యోగినిగా చేస్తుంది. ఆమె కుమారుడు పెళ్లిడుకి రావడంతో తన కొడుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి గుంటూరుకు చెందిన యువతితో మే 26న వివాహం జరిపించారు.

పెళ్ళికి ముందు కట్నంగా రూ. 6 లక్షలు, పెళ్లికి మరో రూ.2 లక్షలు అడిగారు. అంతే కాదు ఆమె ఓ కండీషన్ కూడా పెట్టింది. తన కుమారుడి తొలిరాత్రి భువనేశ్వర్‌లో జరగాలని ఒత్తిడి చేసింది. అందుకు యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తొలిరాత్రిని నర్సరావుపేటలో ఏర్పాటు చేశారు. తొలిరాత్రి రోజు యువకుడు వింత ప్రవర్తనలతో ఆ యువతి నిశ్చేష్టురాలైంది. అదే తరహాలో మూడు రాత్రులు వ్యవహరించడంతో ఆమెకు అనుమానం వచ్చి నిలదీసింది. దీంతో యువకుడు నీతులు చెప్పడం మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చిన అతను ఈ వయసులో కోరికలు ఎక్కువ ఉండకూడదంటూ మాత్ర వేసుకొని నిద్రపోయాడు.

ఇలా మూడు రోజులు జరిగింది. చివరి రోజు మాత్రలు అయిపోయాయి. ఆ యువతి వద్దకు వెళ్లి.. మాత్రలు వేసుకోకపోతే తలనొప్పి, నోటివెంట సొంగ పడుతుందన్నాడు. తనకు ఆరోగ్యం బాగోలేదు. మానసిక స్థితి సరిగాలేదంటూ తెలపడంతో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. వాళ్లు వచ్చి అత్తను ప్రశ్నిస్తే తన కుమారుడు ఆరోగ్యవంతుడేనని, తలనొప్పికి మాత్రలు వేసుకుంటున్నాడు.. కావాలంటే జీజీహెచ్‌ డాక్టర్ ను సంప్రదించాలని తెలిపింది. వైద్యుడి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది అత్త.. దీంతో యువతి వైద్యుడిని ప్రశ్నించగా ఆయన విస్తుపోయే వాస్తవాలు తెలిపారు.

ఆ యువకుడికి మానసిక స్థితి సరిగాలేదని, మాత్రలు వాడకపోతే ప్రమాదమని వైద్యుడు తెలిపాడు. దీంతో ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన అత్తకు ఉన్న పరిచయాలతో కేసును తప్పుదోవ పట్టించడానికి యత్నిస్తుందని వాపోయారు.

Tags

Read MoreRead Less
Next Story