మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉపాధి కోల్పోయిన గెస్ట్‌ లెక్చరర్‌ ఆత్మహత్య...!

మహబూబ్‌నగర్‌ జిల్లా బొల్లంపల్లికి చెందిన గెస్ట్‌ లెక్చరర్‌ గణేష్‌ చారి ఉపాధి కోల్పోయి... ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్‌ చారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉపాధి కోల్పోయిన గెస్ట్‌ లెక్చరర్‌ ఆత్మహత్య...!
X

మహబూబ్‌నగర్‌ జిల్లా బొల్లంపల్లికి చెందిన గెస్ట్‌ లెక్చరర్‌ గణేష్‌ చారి ఉపాధి కోల్పోయి... ఆత్మహత్య చేసుకున్నాడు. గణేష్‌ చారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం వెల్దండ జూనియర్‌ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌గా చేరాడు. కరోనా పరిస్థితుల్లో కాలేజీలు మూత పడటంతో ఉపాధి లేక ఇబ్బందులు పడ్డాడు. రోడ్డు ప్రమాదానికి కూడా గురి కావడంతో.. చికిత్స కోసం అప్పులు చేశాడు. కాలేజీలు ప్రారంభమైతే ఉపాధి లభిస్తుందని భావించాడు. కానీ కాలేజీలు ప్రారంభమై... రెండు వారాలైనా... అధికారుల నుంచి పిలుపు రాలేదు. గెస్ట్‌ లెక్చరర్‌ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన గణేష్‌ చారి .. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Next Story

RELATED STORIES