హిజ్రాపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్యాంగ్.. చికిత్స పొందుతూ మృతి

హిజ్రాపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గ్యాంగ్.. చికిత్స పొందుతూ మృతి
X

హైదరాబాద్‌లో హిజ్రాల మధ్య గ్యాంగ్‌ వార్‌.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎర్రగడ్డ, చందానగర్‌ హిజ్రా గ్రూపులు పరస్పరం దాడికి దిగాయి. హంసా అనే హిజ్రాను.. చందానగర్‌కు చెందిన గ్రూప్‌.. పెట్రోల్‌ పోసి సజీవదహన యత్నానికి పాల్పడింది. తీవ్రంగా గాయపడిన హంస.. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఇటీవల హంస అనే హిజ్రా..ఎర్రగడ్డ నుంచి చందానగర్‌కు మకాం మార్చింది. దీంతో తమ ఏరియాలోకి వచ్చిందనే కోపంతో చందానగర్‌కు చెందిన హిజ్రాలు.. పలుమార్లు వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో కూడా రెండు వర్గాల మధ్య కత్తులతో పరస్పర దాడులు కూడా జరిగాయి. ఈ సారి ఏకంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించారు.

హంస మృతికి కారణమైన సదా వర్గం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం హిజ్రా సదా వర్గం పరారీలో ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

RELATED STORIES