పరువు హత్యకు గురైన ఫిజియో థెరపిస్ట్‌

పరువు హత్యకు గురైన ఫిజియో థెరపిస్ట్‌
X

కర్నూలు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది.. ఆదోని విట్టా కిట్టప్పనగర్‌లో ఫిజియో థెరపీ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యాడు.. బైక్‌పై వెళ్తున్న ఆదాం అస్మిన్‌ను బండరాళ్లతో కొట్టి చంపారు దుండగులు. పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకుంది.

అస్మిన్‌ హత్యకు ప్రేమ వివాహమే కారణంగా తెలుస్తోంది.. మహేశ్వరి అనే యువతిని ప్రేమించిన అస్మిన్‌ రెండు నెలల క్రితం పెళ్లిచేసుకున్నాడు.. యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.. అస్మిన్‌ ఆదోనిలోని దేవి నర్సింగ్‌ హోమ్‌లో ఫిజియో థెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు.. అస్మిన్‌ను తన తల్లిదండ్రులే హత్య చేయించారని మహేశ్వరి ఆరోపిస్తోంది.

Next Story

RELATED STORIES