భార్య.. తన మాట లేదని భర్త సూసైడ్.. తనతోపాటు భార్యనూ కూడా..

ఒంటికి నిప్పుపెట్టుకుని భార్యను కూడా పట్టుకోవడంతో ఆమెకు కూడా మంటలు అంటుకుని చనిపోయింది.

భార్య.. తన మాట లేదని భర్త సూసైడ్.. తనతోపాటు భార్యనూ కూడా..
X

అప్పుల బాధతో ఓ భర్త సూసైడ్ చేసుకున్నాడు. తనతోపాటు భార్యనూ చంపేశాడు. ఈ విషాదకరమైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌లో జరిగింది. బండి భాస్కర్‌, విజయలకు 16 ఏళ్ల కిందటే పెళ్లయ్యింది. ఆటో నడుపుతూ జీవించే విజయ్‌ వ్యసనాలకు బానిసై ఏకంగా 20 లక్షల వరకూ అప్పులు చేశాడు. ఆ డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తూ ప్రతిరోజూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుండడంతో ఈ విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీంతో.. పుట్టింటి నుంచి 10 లక్షలు తేవాలంటూ భార్య విజయను వేధించడం మొదలుపెట్టాడు.

సోమవారం మరోసారి ఈ విషయంపైనే గొడవ జరిగింది. తన మాట వినడం లేదనే కోపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు భాస్కర్‌. ఒంటికి నిప్పుపెట్టుకుని భార్యను కూడా పట్టుకోవడంతో ఆమెకు కూడా మంటలు అంటుకుని చనిపోయింది. భార్యాభర్తలు ఇద్దరూ చనిపోవడంతో వీళ్ల కుమారుడు అనాథగా మారాడు. మిల్స్ కాలనీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES