క్రైమ్

కరోనా సోకిన భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త..!

గోరింకపాలెం వీధిలో నివాసం ఉండే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది.

కరోనా సోకిన  భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త..!
X

కట్టుకున్న భార్యను బ్లేడ్ తో కోసి చంపేశాడు ఓ భర్త.. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గోరింకపాలెం వీధిలో నివాసం ఉండే మల్యాద్రి, అనురాధ(30) దంపతులకు 13 రోజుల క్రితం కరోనా వైరస్‌ సోకింది. దీనితో వారి పిల్లలను బంధువుల ఇంటికి పంపి వారు ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఈ క్రమంలో అనురాధకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో 108, 104 వాహనాలకు సమాచారం ఇచ్చిన అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అనంతరం చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించిన మల్యాద్రి తన భార్య అనురాధ మణికట్టుపై విచక్షణారహితంగా కోశాడు.

అనంతరం తాను కూడా ఎడమచేతి మణికట్టుపై కోసుకొని బయటకు వెళ్ళిపోయాడు. అనంతరం పొలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలియగానే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే అనురాధ మృతి చెందింది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES