భార్యపై పైశాచికంగా కత్తితో దాడి చేసిన భర్త

భార్యపై పైశాచికంగా కత్తితో దాడి చేసిన భర్త
X

వికారాబాద్ జిల్లాలో ఓ భర్త కసాయిగా మారాడు. మనస్పర్ధలతో దూరంగా ఉంటున్న భార్యపై పైశాచికంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. వికారాబాద్ పట్టణంలో లేడీస్ ఎంపోరియమ్‌లో పనిచేస్తున్న భార్య సుజాతపై... భర్త వెంకటేష్ కర్కశంగా కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఇద్దరి మధ్య గొడవ కారణంగా వీరు ఆరు సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా.. భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆరుసార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సుజాతను స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES