ఎంత మోసం.. ఎంత మోసం.. డబ్బులు ఊరికే రావంటూ..

ఎంత మోసం.. ఎంత మోసం.. డబ్బులు ఊరికే రావంటూ..
Behind every wealth there is a crime ఇది గాడ్ ఫాదర్ నవలలోని ఓ డైలాగ్. మరి దేశంలో ఇప్పుడు రాత్రికి రాత్రే కోట్లకి కోట్లు పోగేసుకుంటున్న నయా ధనవంతుల వెనుక కూడా ఇలాంటి నేరాలే ఉన్నాయా అంటే, కొంతవరకూ నిజం ఉందనే ఒప్పుకోవాలి.

Behind every wealth there is a crime : ఇది గాడ్ ఫాదర్ నవలలోని ఓ డైలాగ్. మరి దేశంలో ఇప్పుడు రాత్రికి రాత్రే కోట్లకి కోట్లు పోగేసుకుంటున్న నయా ధనవంతుల వెనుక కూడా ఇలాంటి నేరాలే ఉన్నాయా అంటే, కొంతవరకూ నిజం ఉందనే ఒప్పుకోవాలి. తాము చేసే నేరాలకు అందమైన కవర్ తొడగడం, మోసాలకు మసి పూసి మ్యాంగోలు చేయడం ఇప్పటి నియో రిచ్ ఫెలోస్‌కి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వారిలో ఒకరి స్టోరీ ఇది

బాగా కష్టపడి పైకొచ్చానని చెప్పుకునే ఓ వ్యక్తి ఏకంగా ఓ వెయ్యి కోట్లు పన్ను ఎగ్గొట్టేశాడు. చెన్నైలో మార్చి 3న ఆదాయపు పన్ను అధికారులు సదరు వ్యక్తికి సంబంధించిన రెండు సంస్థలపై దాడులు చేశారు. రెండింటిలోనూ కలిపి వెయ్యి కోట్లకి పైగానే లెక్కలకు రాని మొత్తాన్ని కనుక్కున్నారు. అలానే క్యాష్ రూపంలో కోటిన్నర వరకూ సీజ్ చేశారు. మార్చి 3న ఈ సోదాలు చెన్నై, ముంబై, కోయింబత్తూరు, మదురై, తిరుచి, త్రిసూర్, నెల్లూరు ,జైపూర్, ఇండోర్ సహా 27 ప్రాంతాల్లో జరిగాయని మార్చి 7కి కానీ తెలియలేకుండా పోయింది.

సదరు షాపులలో దొరికిన డబ్బు, లోకల్ ఫైనాన్షియర్ల నుంచి డబ్బు భారీ మొత్తాల్లో తీసుకోవడం, తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెట్టుబడి పెట్టడం వంటి కార్యకలాపాలకు వాడుతున్నట్లు గుర్తించారు. ఈ డబ్బంతా ఎక్కడ్నుంచి వస్తుందయ్యా అంటే లెక్కల్లోకి రాని బంగారం కొనుగోళ్లు, ఎక్కడ్నుంచో బంగారం దిగుమతి చేసుకోవడం, ఎగుమతి చేయడం ద్వారా భారీగా డబ్బు పోగేస్తుండగా..ఇవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరగడమే, ఐటీ అధికారులకు స్లిప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దేనీకి లెక్కా పత్రం లేకుండా ఉండటంతో..అలా వచ్చిన సొమ్మును బంగారం తరుగు రూపంలో నష్టాలుగా కూడా చూపిస్తున్నట్లు ఐటీ సిబ్బంది గుర్తించారట. ఇలా అక్రమధనాన్ని తర్వాత రియల్ఎస్టేట్‌ వెంచర్లలోకి ప్రవహింపజేస్తున్నట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించి షాక్ అయ్యారట..! ఇలా చేసే ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టే తరుగు లేకుండా..నగల ధరలు కంపేర్ చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నట్లు నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు.

సదరు నగల సంస్థ దుకాణాల్లో ఈ సోదాలు జరిగి వారం రోజులు దాటిపోయింది. ఈ రెయిడ్స్ తాలుకూ ఔట్‌కమ్ మాత్రం ఇంతవరకూ బైటికి రాలేదు.ఇంతేకాదు..అయ్యగారికి చెందిన బ్రాంచ్‌లలో భారీగా దొంగతనాలు జరిగిన తీరుపై కూడా చాలా అనుమానాలు వస్తుంటాయ్.

Tags

Read MoreRead Less
Next Story