ఓ మృగాడి పైశాచికత్వం.. మంటల్లో కాలిపోయిన బాలిక.. పోలీసుల ఓవరాక్షన్!

ఓ మృగాడి పైశాచికత్వం.. మంటల్లో కాలిపోయిన బాలిక.. పోలీసుల ఓవరాక్షన్!

ఖమ్మంలో ఓ మృగాడి పైశాచికత్వానికి మంటల్లో కాలిపోయిన బాలిక ప్రాణాలు కోల్పోయింది. గత 28 రోజులుగా మృత్యువుతో పోరాడి చివరికి ప్రాణాలు వదిలింది. ఉస్మానియాలో చికిత్సపొందుతూ ఆమె మృతిచెందింది. ఈ సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు. కుటుంబ సభ్యులకు తెలియకుండానే పోస్టుమార్టం పూర్తిచేసి డెడ్ బాడీని ఉస్మానియానుంచి తరలించారు. పోస్టుమార్టంపై మీడియాను కూడా తప్పుదోవ పట్టించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతిచెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికి జరుగకూడదని బాలిక తండ్రి ఉప్పలయ్య, చిన్నాన్న రమేష్ అంటున్నారు. తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఓ ఇంట్లో పనికి కుదిరిన బాలికపై యజమాని కొడుకు సెప్టెంబర్‌ 18న అత్యాచారయత్నం చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. తీవ్ర గాయాల పాలైన బాలికను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి ఆపై ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదవశాత్తూనే ఇది జరిగిందని చెప్పారు. తీరా బాలిక కాస్త కోలుకున్నాక ఏం జరిగిందో చెప్పడంతో ఘోరం వెలుగులోకి వచ్చింది.

పాలేరు నియోజక వర్గం పల్లెగూడెంకు చెందిన బాలిక మృతిపట్ల మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సంతాపం తెలిపారు. పల్లెగూడెం వెళ్లి బాలిక భౌతిక కాయాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు అందజేశారు. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, హత్యపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. కామాంధున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. బాలిక కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story