అతడిని చూసి నవ్వడమే ఆమెకు శాపంగా మారింది..!

ఓ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళను చూశాడు ఓ యువకుడు.. ఆ సమయంలో ఆమె కూడా అతగాడిని చూసి నవ్వింది.

అతడిని చూసి నవ్వడమే ఆమెకు శాపంగా మారింది..!
X

ఓ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళను చూశాడు ఓ యువకుడు.. ఆ సమయంలో ఆమె కూడా అతగాడిని చూసి నవ్వింది. అదే ఆమెకి శాపంగా మారింది. అప్పటినుంచి ఆ యువకుడు ఆమెతో పరిచయం పెంచుకొని లైంగిక జీవితం పొందాలని ఆమెపై ఒత్తిడి చేశాడు ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్‌ జిల్లా ఇరవన్నూర్‌కు చెందిన రంజిత్‌ ఒకసారి పాతనంతిట్టకు చెందిన ఉపాధ్యాయురాలిని ఓ కార్యక్రమంలో చూశాడు. అక్కడ ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెతో లైంగిక జీవితం పొందాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు.

అయితే అప్పటికే తనకి పెళ్లయ్యిందని ఆమె చెప్పిన వినకుండా మరి వెంటపడ్డాడు కావాలంటే నీ భర్తను వదిలేసి నాతో వచ్చేయ్‌.. నేను పెళ్లి చేసుకుంటానని మరింతగా వేధింపులకు గురి చేశాడు. అయితే అప్పటికే ఆమె తన భర్తకు దూరంగా నివసిస్తోంది. ఒకానొక సమయంలో అతడి మాటలకి ఆమె కరిగిపోయింది. అతడితో కలిసి సహజీవనం చేయసాగింది. కొన్ని రోజులు బాగానే ఉంది కానీ ఆమెతో కలిసి ఉంటున్న సమయంలోనే వేరేవారితో అతను సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆమెకి తెలిసింది.

దీనితో ఆమె రంజిత్‌కు దూరంగా ఉంటోంది. అయినప్పటికీ మరోసారి శారీరక సంబంధం కావాలని ఆమె పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఒప్పుకోకపోవడంతో రహాస్య ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకి దిగాడు. ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపైన వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కి తరలించారు.

Next Story

RELATED STORIES