Anantapur : లక్కీ లేడీ.. తృటిలో తప్పిన ప్రమాదం..

Anantapur : లక్కీ లేడీ.. తృటిలో తప్పిన ప్రమాదం..
Anantapur : కాళ్ల కింద భూమి కదిలిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Anantapur : కాళ్ల కింద భూమి కదిలిపోవడం అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. కింద నీళ్లు, పైన నేల ఉండడంతో.. నదిపై ఉన్న రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది ఓ మహిళ. ఇంకొక్క అడుగు వేస్తే చాలు గట్టు చేరేదే. సరిగ్గా అదే సమయంలో.. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయింది. ఉన్నఫళంగా భూమి కుంగిపోయింది. కట్ట కింద నుంచి పారుతున్న ప్రవాహంలో భూమి కొట్టుకుపోయింది. చివరి అడుగు తడబడినా.. చేతులతో గట్టును పట్టుకోవడంతో ఆ మహిళ తప్పించుకోగలిగింది. లేదంటే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేదే. ఈ దృశ్యం చూసిన వాళ్లంతా.. ఆ మహిళ అదృష్టవంతురాలు అని తలచుకుంటున్నారు. ఒకవేళ.. దారి మధ్యలో ఉన్నప్పుడే ఆ రోడ్డు కొట్టుకుపోయి ఉంటే.. దారుణం జరిగేదే.

ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గం యల్లనూరు మండలంలో చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మండల పరిధిలోని సింగవరం వద్ద చిత్రావతి నది రోడ్డు.. కోతకు గురైంది. అదే సమయంలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా రోడ్డు కుంగిపోయింది. అరక్షణంలో స్పందించిన స్థానికులు.. మహిళను ఒడ్డుకు లాగేశారు. దీంతో పెను ప్రమాదం నుంచి బయటపడింది ఆ మహిళ.

Tags

Read MoreRead Less
Next Story