Tamil Nadu: ఇంటర్ విద్యార్థితో ప్రేమలో పడిన లెక్చరర్.. పారిపోయి పెళ్లి కూడా..

Tamil Nadu: ఇంటర్ విద్యార్థితో ప్రేమలో పడిన లెక్చరర్.. పారిపోయి పెళ్లి కూడా..
Tamil Nadu: షర్మిల, ఆ విద్యార్థి.. ఇద్దరూ ఒకేసారి కనిపించకుండా పోవడంతో వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది.

Tamil Nadu: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అని చెప్తుంటారు పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నవారు. అందుకే కొన్ని ప్రేమకథలు వింటుంటే వింతంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక విద్యార్థిని, ఒక లెక్చరర్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది మనం పలుమార్లు చూసే ఉంటాం. కానీ తమిళనాడులో ఓ ఇంటర్ విద్యార్థిని ప్రేమించింది ఓ టీచర్. ఆ తర్వాత ఇద్దరు పారిపోయి కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ప్రైవెట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్న 17 ఏళ్ల విద్యార్థి.. ఈ నెల 5 నుండి కనిపించట్లేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విద్యార్థి చదువుకుంటున్న కాలేజీ దగ్గర నుండే విచారణను మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కడ లెక్చరర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల షర్మిల కూడా కొన్నిరోజుల నుండి కనిపించట్లేదని పోలీసులు గమనించారు.

షర్మిల, ఆ విద్యార్థి.. ఇద్దరూ ఒకేసారి కనిపించకుండా పోవడంతో వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు షర్మిల ఫోన్ నెంబర్‌ను ట్రాక్ చేసి వారు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నారు. అప్పటికే వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయినట్టు సమాచారం. అయినా విద్యార్థి మైనర్ కావడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని తనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story