ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

ప్రేమిస్తున్నానని వేధిస్తున్న వ్యక్తికి.. ఆ ప్రేమ నచ్చలేదని చెప్పడమే ఇంతటి ఘోరానికి దారి తీసింది.

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని
X

హైదరాబాద్‌ గండిపేటలో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు ప్రేమోన్మాది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్న సులేమాన్‌ అనే వ్యక్తి.. అదును చూసి దాడి చేశాడు. యువతిని రక్షించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులపైనా కత్తితో తెగబడ్డారు. ఈ దాడిలో యువతి, యువతి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తన ఇష్టాన్ని నిర్భయంగా చెప్పడమే తప్పైంది. ప్రేమిస్తున్నానని వేధిస్తున్న వ్యక్తికి.. ఆ ప్రేమ నచ్చలేదని చెప్పడమే ఇంతటి ఘోరానికి దారి తీసింది. ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన యువతి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. దాడి చేసిన సులేమాన్.. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నార్సింగి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని హైదర్‌షా కోటలో ఓ అపార్ట్‌మెంట్‌లో యువతి నివసిస్తోంది. ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్న ప్రతిసారి నిరాకరిస్తూనే వచ్చింది. దీంతో యువతిని టార్గెట్‌ చేసిన సులేమాన్.. దాడి చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన విషయం గమనించి.. నేరుగా యువతి ఇంటికే వెళ్లాడు. కత్తితో యువతిపై దాడి చేస్తుండగా కుటుంబ సభ్యులు రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో యువతి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.

యువతిపై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న యువతిని బండి సంజయ్‌ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. యువతి కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.


Next Story

RELATED STORIES