క్రైమ్

'లేడీసింగం' ఆత్మహత్య.. పై అధికారి లైంగిక వేధింపులతో..

శత్రువును మట్టుపెట్టే ఉద్యోగం.. ఖాఖీ దుస్తుల్లోని కాఠిన్యం.. కానీ ఇవేవీ ఆమెని కాపాడలేకపోయాయి. ఆమె సున్నితమైన మనసు అధికారి దుర్మార్గాన్ని ఎదిరించలేకపోయింది. కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టలేకపోయింది.

లేడీసింగం ఆత్మహత్య.. పై అధికారి లైంగిక వేధింపులతో..
X

శత్రువును మట్టుపెట్టే ఉద్యోగం.. ఖాఖీ దుస్తుల్లోని కాఠిన్యం.. కానీ ఇవేవీ ఆమెని కాపాడలేకపోయాయి. సహజంగా ఉండే ఆమె సున్నితమైన మనసు అధికారి దుర్మార్గాన్ని ఎదిరించలేకపోయింది. కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టలేకపోయింది. ఒంటరి పోరాటంతో అలసిపోయింది. శుక్రవారం రాత్రి తన సర్వీస్ రివాల్వర్‌తో తనే కాల్చుకుని తనువు చాలించింది. టైగర్ రిజర్వర్ సమీపంలోని హరిసల్ గ్రామంలోని తన అధికారిక క్వార్టర్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని అక్కడికక్కడే మరణించారు.

ఆమె రక్తం చిందిన శరీరాన్ని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. దీపాలి పై అధికారి తనను లైంగిక వేధింపులకు గురిచేసిన వృత్తాంతాన్ని 4 పేజీల సూసైడ్ నోట్‌‌లో పేర్కొంది. ఆమె డెడ్ బాడీ పక్కన కనిపించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీపాలీ ఆత్మహత్యకు కారణమైన డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డిసిఎఫ్) వినోద్ శివ్‌కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, తనలా మరెవరూ అలాంటి వేధింపులకు గురికావద్దని ఆమె పోలీసులను వేడుకుంది.

ఎందరో అమాయకులు ఇలాంటి కామాంధులకు బలవుతున్నారని శివకుమార్‌ని కఠినంగా శిక్షించాలని పేర్కొంది. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలో జరిగింది. 28 ఏళ్ల దీపాలి చవాన్-మోహితే మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ అమరావతిలో రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీపాలి భర్త రాజేష్ మోహితే చిఖల్ధారాలో ట్రెజరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మాఫియాకు వ్యతిరేకంగా పోరాడి 'లేడీ సింఘం'గా పేరు తెచ్చుకుంది దీపాలీ. తల్లిని తన వద్ద వుంచుకుంటున్న దీపాలి.. ఆమె తన గ్రామం సతారాకు వెళ్లినప్పుడు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంది.

బెంగళూరుకు రైలు ఎక్కడానికి వేచి ఉన్న సమయంలో ఐఎఫ్ఎస్ అధికారి శివకుమార్ ను నాగ్పూర్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి ఇన్వెస్టిగేషన్ కోసం అతడిని అమరావతికి తీసుకువచ్చారు.

శివకుమార్ ఆమెను లైంగికంగా వేధించాడని, గత కొన్ని నెలల నుండి నిరంతరం తనను మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని దీపాలీ లేఖలో పేర్కొంది. గతంలో అనేక సార్లు దీపాలి తన సీనియర్, ఎంటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్, ఎంఎస్ రెడ్డి (ఐఎఫ్ఎస్) కు శివకుమార్ గురించి ఫిర్యాదు చేశారు. అయినా అధికారి తన అభ్యర్ధనలను పట్టించుకోలేదని నిందితుడి వైపే మాట్లాడినట్లు పేర్కొంది.

శివకుమార్ మద్యం తాగే వియాన్ని కూడా దీపాలి హైలైట్ చేసింది. చాలా సార్లు బహిరంగంగా మరికొన్ని సార్లు ప్రైవేటుగా తనను అసభ్యకరమైన పదజాలంతో దూషించే వాడని పేర్కొంది. అయినప్పటికీ ఆమె అతన్ని పదేపదే మందలించడంతో పాటు అతడిపై తీవ్రమైన కోపాన్ని ప్రదర్శించేది. అందుకు రివెంజ్ తీసుకున్న శివకుమార్ దీపాలీ డ్యూటీ షెడ్యూల్‌ని మార్చేవాడు.

ఒకసారి ఆమె జీతం ఆమెకు రాకుండా చేశాడు. మరో దురదృష్టకరమైన సంఘటన 2020 లో వివాహం చేసుకున్న దీపాలి గర్భం దాల్చగా ఫిబ్రవరి ఆరంభంలో, శివకుమార్ తనతో పాటు 3 రోజుల పాటు అడవిలో పెట్రోలింగ్ చేయడానికి తనతో రమ్మన్నాడు. గర్భంతో ఉన్న తన పరిస్థితిని పట్టించుకోకుండా వందలాది కిలోమీటర్ల దూరం నడవడంతో గర్భస్రావం అయ్యింది.

తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు తల్లి శకుంతల చవాన్ యొక్క ప్రేమపూర్వక సంరక్షణతో దీపాలీ కోలుకుంది. తన నిజాయితీ, తనకి ఉన్న ఇమేజ్‌ కారణంగా ఐదేళ్ల క్రితం తన అధికారిక వాహనంలో మధ్యప్రదేశ్‌కు రైలులో పారిపోతున్న అటవీ స్మగ్లర్ల ముఠాను వెంబడించి దీపాలి వారిని ధైర్యంగా పట్టుకుంది.

తరువాతి స్టేషన్లో ఐదు టన్నుల విలువైన అడవి ఉత్పత్తి 'లక్' ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠాను ఆమె అడ్డుకుని వారిని అరెస్టు చేసింది. సరుకును స్వాధీనం చేసుకుని మహారాష్ట్రకు తిరిగి తీసుకువచ్చింది. అటవీ ఉత్పత్తులను దొంగిలించిన వారి ఆటకట్టించింది. అటవీ శాఖ అధికారిగా అడవుల్లో సంచరిస్తున్నప్పుడు జంతువులను వేటాడడానికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసింది.

2013 లో మహారాష్ట్ర ప్రభుత్వం అడవుల్లో అక్రమ ఆక్రమణలకు వ్యతిరేకంగా కుడ్గెల్స్‌ను చేపట్టింది. ఆ సమయంలో స్థానిక రాజకీయ నాయకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయనాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం లేదా లాభాల కోసం అక్రమాలను అడ్డుకున్నందుకు దీపాలీపై కోపంగా ఉండేవారని ఆమె స్నేహితుడు భటే చెప్పారు.

దీపాలీ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల గురించి స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ సంఘటనపై అన్ని కోణాలను కూలంకషంగా దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES