యువతులను విదేశాలకు పంపి వ్యభిచారం చేయిస్తున్న దుర్మార్గుడు అరెస్ట్

15 మంది యువతులను సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌లకు పంపి వ్యభిచార గృహాలు నడిపాడు.

యువతులను విదేశాలకు పంపి వ్యభిచారం చేయిస్తున్న దుర్మార్గుడు అరెస్ట్
X

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యువతుల్ని టార్గెట్‌ చేసి.. విదేశాలకు పంపి వ్యభిచారం చేయిస్తున్న ఓ దుర్మార్గుడ్ని చిత్తూరు జిల్లా నగరి పోలీసులు అరెస్టు చేశారు. కరోనా కారణంగా నగరిలో మగ్గాల వ్యాపారం పడిపోవడంతో ఆర్థికంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీన్ని ఆసరాగా చేసుకుని.. అరసు అనే వ్యక్తి యువతులను టార్గెట్ చేసేవాడు. ఇబ్బందుల్లో ఉన్న యువతలను గుర్తించి విదేశాల్లోని తమ స్నేహితుల ఇళ్లలో పని ఇప్పిస్తానని..వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పేవాడు.

యువతులను విదేశాలకు పంపి వ్యభిచారం చేయించేవాడు. ఇలా.. 15 మంది యువతులను సింగపూర్‌, మలేషియా, దుబాయ్‌లకు పంపి వ్యభిచార గృహాలు నడిపాడు. అయితే.. వ్యభిచార గృహంలో చిక్కుకున్న ఓ యువతి తప్పించుకుని నగరి వచ్చిన పోలీసులను ఆశ్రయించింది. యువతులను మోసం చేసి విదేశాలకు పంపుతున్న అరసుతోపాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు పెట్టారు. ప్రస్తుతం అరసుని పోలీసులు అరెస్టు చేశారు. విదేశాల్లో చిక్కుకున్న యువతను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Next Story

RELATED STORIES