Maoist : మావోయిస్టు క్యాంపులపై వైమానిక దాడులు

Maoist : మావోయిస్టు క్యాంపులపై వైమానిక దాడులు
సుక్మా, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతం పామేడ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాంపులపై వైమానిక దాడులు నిర్వహించారు

ఛత్తీస్‌గఢ్‌లో కాల్పుల మోత మోగుతోంది.. ఇప్పటికే మావోయిస్టు ప్రాంతాల్లో భారీఎత్తున కూంబింగ్‌ నిర్వహించిన బలగాలు.. మావోయిస్టు క్యాంపులపై వైమానిక దాడులు చేశాయి.. సుక్మా, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతం పామేడ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టు క్యాంపులపై వైమానిక దాడులు నిర్వహించారు. బట్టిగూడ, కవర్‌ గట్ట, మినగట్ట, దబ్బగట్ట ప్రాంతాల్లో మావోయిస్టు క్యాంపులపై డ్రోన్లు, హెలికాప్టర్లతో భద్రతా బలగాలు మెరుపు దాడులు చేశాయి. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story