పెళ్లైన సంవత్సరానికే వివాహిత అనుమానాస్పద మృతి

పెళ్లైన సంవత్సరానికే వివాహిత అనుమానాస్పద మృతి
X

జగద్గిరిగుట్ట పోలీస్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. నవోదయ కాలనీకిచెందిన లక్ష్మిప్రసన్న ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మి ప్రసన్నకు కార్తీక్‌తో 14 నెలలక్రితమే వివాహమైంది. సాప్ట్ వేర్ ఉద్యోగి అయిన కార్తీక్ .. పెళ్లైన కొద్దిరోజులకే భార్యను అదనపు కట్నం కోసం వేధించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త కార్తీకే భార్యను హత్యచేశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

RELATED STORIES