చిన్నారుల కళ్లముందే అమ్మ చేసిన పని.. సెల్ఫీ దిగుతూ.. ఏదో చెబుతూ..

చిన్నారుల కళ్లముందే అమ్మ చేసిన పని.. సెల్ఫీ దిగుతూ.. ఏదో చెబుతూ..
కర్ణాటకకు చెందిన సతీష్‌గౌడ, మంజులగౌడ దంపతులు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లాలాపేటకు వచ్చి స్థిరపడ్డారు.

ఆ పిల్లలిద్దరికీ 10, 11 ఏళ్ల వయసు.. అమ్మ ఏం చేస్తుందో ఇంకా అర్థం చేసుకునే వయసు రాలేదు.. అయినా అమ్మా వద్దు ప్లీజ్ అన్నారు.. కానీ ఆమె మనసు కరగలేదు.. కళ్ల ముందు కన్నబిడ్డలు కనబడుతున్నా కనికరం లేకుండా కాన రాని లోకాలకు కావాలని బలవంతంగా వెళ్లింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పిల్లల ఎదుటే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన సతీష్‌గౌడ, మంజులగౌడ దంపతులు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ లాలాపేటకు వచ్చి స్థిరపడ్డారు. ఇద్దరూ కలిసి బేకరీ నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు.

వీరికి ఇద్దరు చిన్నారులు రంజిత్ (11), తేజస్ (10) ఉన్నారు. ఆదివారం ఉదయం మంజుల పిల్లల ఎదుటే సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీ బిగించింది. అది చూసి చిన్నారు ఎందుకు మమ్మీ అని అడిగినా సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత సెల్‌ఫోన్‌లో వీడియో ఆన్ చేసి ఏదో చెబుతూ ఉరి వేసుకునేందుకు ప్రయత్నించడంతో వారికి అనుమానం వచ్చి.. ప్లీజ్ మమ్మీ.. వద్దు మమ్మీ అంటూ ఏడ్చినా వినిపించుకోలేదు. చిన్నారుల కళ్ల ముందే అమ్మ ప్రాణాలు తీసుకుంది.



దీంతో చిన్నారులు ఏడ్చుకుంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. అతడు వచ్చి చూసేసరికి మంజుల ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంజుల సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేం వద్దన్నా మా మమ్మీ వినలేదు అంటూ జరిగినదంతా చిన్నారులు ఏడుస్తూ పోలీసులకు చెప్పడం అక్కడున్న వారిని కలచివేసింది. మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు.

ఆర్ధిక ఇబ్బందులు లేవు.. ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అర్థం కావట్లేదు అని సంతోష్ గౌడ్ పోలీసులకు వివరించాడు. ఆత్మహత్యకు ముందు మంజుల తీసుకున్న సెల్ఫీ వీడియోను విశ్లేషిస్తున్నారు పోలీసులు. అయితే తన మరణానికి ఎవరూ కారణం కాదని ఆ వీడియోలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story