Mumbai: ముంబైని పేల్చివేస్తానన్న ఆకతాయి అరెస్ట్

Mumbai: ముంబైని పేల్చివేస్తానన్న ఆకతాయి అరెస్ట్

త్వరలో ముంబైలో పేలుళ్లు జరగబోతున్నాయి... నేను ముంబైలో పూళ్లుల్లకు పూనుకున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే సదరు యువకున్ని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన బెదిరింపు మెసేజ్ ను మంగళవారం గుర్తించిన పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను పోలీసులకు కూడా సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. నగరంలో పేలుళ్లు చేస్తానని పేర్కొన్న ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి తమకు ఆన్‌లైన్‌లో బెదిరింపు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన బెదిరింపు సందేశాన్ని పోలీసులు చూశారు. "నేను త్వరలో ముంబైని పేల్చివేస్తాను" అని రాసి ఉంది. మెసేజ్ అందుకున్న పోలీసులు సంబంధిత వ్యక్తి ఖాతాపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ వ్యక్తిని గుర్తించి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story