కొడుకు కోసం భార్యకు 8 సార్లు గర్భస్రావం..1500 స్టెరాయిడ్లు..!

కంప్యూటర్ యుగంలో ఉన్న, అంతరిక్షంలోకి వెళ్తున్న ఇంకా ఆడపిల్ల అంటే చాలామందికి చిన్నచూపే.. ఆడపిల్ల అంటే భారంగానే చూస్తున్నారు.

కొడుకు కోసం భార్యకు 8 సార్లు గర్భస్రావం..1500 స్టెరాయిడ్లు..!
X

కంప్యూటర్ యుగంలో ఉన్న, అంతరిక్షంలోకి వెళ్తున్న ఇంకా ఆడపిల్ల అంటే చాలామందికి చిన్నచూపే.. ఆడపిల్ల అంటే భారంగానే చూస్తున్నారు. కొడుకు పుడితే వంశాన్ని నిలబెడతాడని, ఆడపిల్ల అయితే పెంచడం, పెళ్లి చేయడం కష్టమని భావిస్తున్నారు చాలామంది. అందుకే పురుట్లోనే చంపేయడం, గర్భస్రావం చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి ముంబైలో చోటుచేసుకుంది. వారసుడే కావాలన్న ఉన్మాదంతో ఓ వ్యక్తి తన భార్యకు ఎనిమిది సార్లు అబార్షన్‌ చేయించాడు. కొడుకు కోసం ఆమెకు 1,500 స్టెరాయిడ్లు ఇప్పించాడు.. కొన్నాళ్ళు ఆమె మౌనంగా ఆ బాధను భరించింది. చివరికి పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే ముంబైకి చెందిన బాధితురాలు (40)కి 2007లో ఓ వ్యక్తితో వివాహమైంది. భర్తతో పాటుగా అత్తింటివారు అందరూ ఉన్నతవిద్యావంతులే. ఆమెకి మొదటగా వారుసుడు కావాలని పదేపదే ఆమె దగ్గర ప్రస్తావించేవారు. కొడుకు పుడితే కుటుంబాన్ని కాపాడతాడని.. ఆస్తికి వారసుడు అవుతాడని తెలిపేవారు. ఈ క్రమంలో భాదితురాలు 2009లో మొదట ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2011లో మరోసారి గర్భం దాల్చింది. అయితే ఈ సారి భర్త ఆమెను వైద్యుల వద్దకి తీసుకెళ్ళి లింగనిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో ఆమెకు అబార్షన్‌ చేయించాడు. ఇలానే పలుమార్లు జరిగింది.

అంతేకాకుండా ఆమె భర్త.. ప్రీ-ఇంప్లాంటేషన్ జన్యు నిర్ధారణ కోసం ఆమెను బ్యాంకాక్‌కు తీసుకెళ్లాడు. ఇండియాలో దానిని నిషేదించడంతో బ్యాంకాక్ తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెకు గర్భధారణకు ముందే పిండం లింగాన్ని పరీక్షించడం కోసం చికిత్స, సర్జరీలు చేశారు. మగపిల్లాడి కోసం ఆమెకు ఏకంగా 1500 హార్మోనల్‌ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ విషయం ముందుగా బాధితురాలికి తెలియలేదు. విషయం తెలుసుకున్న తర్వాత ఆమెకు సహనం నశించింది. అటు అత్తింటిపోరుకి కూడా తట్టుకునే ఓపిక లేకుండా పోయింది. దీనితో అత్తింటి ఆగడాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Next Story

RELATED STORIES