50వేల కోట్ల ఆస్తులు.. 2 మిస్టీరియస్ డెత్స్ ! అసలు నిజాలు ఏంటీ?

50వేల కోట్ల ఆస్తులు.. 2 మిస్టీరియస్ డెత్స్ ! అసలు నిజాలు ఏంటీ?
బిజినెస్ లావాదేవీలు, దాయాదుల కక్ష ఈ హత్య వెనుక ఉందని టాక్ ఇప్పటికీ నడుస్తుంటుంది

ఆగస్ట్ 21,2009.. సమయం..అర్ధరాత్రి

ఓ బ్లాక్ ఫోర్డ్ ఎండీవర్ కారు అలప్పుజా వైపు వేగంగా దూసుకుపోతోంది. అందులో ఉన్న ముగ్గురు యువకులు అప్పటికే బాగా మందు పట్టించి ఉన్నారు. రెండు కార్లలో వీళ్ల బ్యాచ్ ముందుకు పోతోంది. ఉన్నట్లుండి ఈ ఫోర్డ్ కారు ఓ బైకర్‌ని డ్యాష్ ఇచ్చింది. ఆ తర్వాత వారిని రెండు టెంపో ట్రావెల్స్ వెంటాడటం ప్రారంభించాయి..

ఈ రెండు వాహనాలూ, ఎండీవర్ కారుకు అడ్డంగా వచ్చేసి నిలబెట్టేశాయి.. లోపల ఉన్న యువకుడిని బైటికి లాగి పంచ్‌లు ఇవ్వడం ప్రారంభించిందో గ్యాంగ్. మొత్తం పాతికమందికిపైగా ఉండటంతో ఈ ఎండీవర్ కారులో ఉన్న యువకులు చూస్తుండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా ఆ యువకుడు ఈ గ్యాంగ్ దెబ్బలకు తాళలేక చనిపోయాడు. కారులో ఉన్న మరో ముగ్గురు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ కోసం అడ్మిట్ అయ్యారు.

ఇంతకీ ఈ యువకుడి వివరాలు పోలీసులు ఆరా తీస్తే షాక్ అయ్యారు. అతను పౌల్ ముత్తూట్ జార్జ్. కేరళకి చెందిన అతి పెద్ద ఫైనాన్షియల్ కంపెనీ ముత్తూట్ ఫైనాన్శ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ కూడా.


పౌల్ ముత్తూట్ జార్జ్ హిస్టరీ చూస్తే, 32ఏళ్లకే హై ఫై అలవాట్లు, డ్రగ్స్ కూడా తీసుకుంటాడని టాక్. పైగా అతను చనిపోయేముందు కారులో ఓం ప్రకాష్ రాజేష్ అనే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఫెలోస్‌ కూడా ఉన్నారు. నార్కోటిక్స్ కేసులో ఓ సారి పౌల్ ముత్తూట్ జార్జ్ పేరు కూడా బైటికి వచ్చింది కానీ ఆ తర్వాత ఎలానో బయటపడ్డాడు. ఈ కేసుని కేరళ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో కుట్ర కోణం లేదంటూనే 11మందిని అరెస్ట్ చేశారు. కేవలం రోడ్డుపై ప్రమాదం కారణంగా తలెత్తిన ఘర్షణలో చోటు చేసుకున్న హత్యగా తేల్చేశారు. హతుడి బాడీ నుంచి ఎస్ షేప్ కత్తిని కూడా రికవర్ చేశారు. సీన్ ఇక్కడ కట్ చేస్తే..

మార్చి 5, 2021.. సమయం.. రాత్రి 9.20

సౌత్‌ఢిల్లీలోని తన నివాసంలో నాలుగో అంతస్థునుంచి పడి, ఎంజె జార్జ్ ముత్తూట్ చనిపోయాడనే వార్త గుప్పుమంది. పై నుంచి పడిన పెద్ద ముత్తూట్‌ను ఢిల్లీ ఫోర్టిస్ హాస్పటల్‌కి తీసుకెళ్లగా ట్రీట్‌మెంట్ జరుగుతుండగా చనిపోయాడని ప్రకటన వచ్చింది. ఐతే కంపెనీ తమ సిబ్బందికి ఇచ్చిన సమాచారం( ఫస్డ్ హ్యాండ్) ప్రకారం, ఆయన గుండెపోటుతో మరణించాడు. ఐతే డాక్టర్లకు చెప్పినది మాత్రం మెట్లపై నుంచి , ఫోర్త్ ఫ్లోర్ స్టెయిర్ కేస్‌పై నుంచి పడిపోయి కన్పించాడని..అంటే రెండు సమాచారాలు ఇచ్చారు. ఈ రెండింటిలో రెండోదే ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది. ఫ్యామిలీ మెంబర్లు కూడా దీన్నే నమ్మాలని కోరుకుంటున్నారు. ఇంతకీ నిజంగానే ఈ మరణాలు సహజంగా చోటు చేసుకున్నవా..లేక ఎవరైనా ప్లాన్ చేశారా..?


మొదటగా..జార్జ్ ముత్తూట్ రెండో కుమారుడు పౌల్ ముత్తూట్ హత్య సంగతి చూడండి.. చనిపోయిన రోజు పౌల్ ముత్తూట్ జార్జ్, అలప్పుజాలో ఓ రిసార్ట్ ఓపెనింగ్ కోసమని వెళ్తున్నాడు. ఐతే ఆ విషయం తెలిసే కావాలనే అతన్ని హత్య చేసారనేది కొంతమంది అనుమానం. అంతేకాదు, విలాసిని అనే ఓ అజ్ఞాతమహిళ, ఆమె కుమారుడు సతీష్ కుమార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు తేల్చారు. ఐతే విలాసిని అప్పట్లోనే హైకోర్టుకు వెళ్లారు. తన కుమారుడు అమాయకుడని కావాలని అతన్ని కేసులో ఇరికించారని వాదించారామె. ఓ న్యూస్ ఛానల్ కూడా పోలీసులే కొంతమంది స్థానిక కంసాలి షాపులో ఓ ఎస్ షేపు కత్తిని తయారు చేయించినట్లు ఆధారాలతో సహా కథనాలు ప్రసారం చేసింది. కానీ అప్పటి ఐజీ కథనం ప్రకారం ముత్తూట్ జార్జ్ పల్లాతురుత్తి దగ్గర ఓ టూవీలర్‌ని ఢీ కొట్టి ఆపకుండా వేగంగా వెళ్లిపోతుండగా..అప్పటికే ఆ దారిలోనే వెళ్తున్న 22మంది గ్యాంగ్ స్టర్ల బృందం అతన్ని దారి కాచి ఆపింది. అతనిపై దాడి చేసింది. ఐతే వెనుక వస్తున్న మరో కారుని గమనించగానే ఆ గ్యాంగ్ ఎస్కేప్ అయింది కానీ బిజినెస్ లావాదేవీలు, దాయాదుల కక్ష ఈ హత్య వెనుక ఉందని టాక్ ఇప్పటికీ నడుస్తుంటుంది కేరళలో..!

ఇప్పుడు జార్జ్ ముత్తూట్ మరణించిన రోజు, క్లోజ్డ్ సర్క్యూట్ టివి ఫుటేజ్‌లో సాయంత్రం 6.40నిమిషాలకు టెర్రెస్ వైపు వెళ్లినట్లు కన్పించిందట అంటే అది జరిగిన మూడుగంటలకు పడిపోయాడని అనుకోవాలి. ఈ 3 గంటలు టెర్రేస్‌పై ఏం చేసాడు. పోలీసులు మాత్రం అది ఆత్మహత్యా, హత్యా, ప్రమాదవశాత్తూ పడిపోయాడా అనేది ఇప్పట్లో ప్రకటించదలుచుకోలేదని అర్ధమవుతోంది. సిసి టివి రేంజ్ టెర్రేస్‌పైన ఏం జరిగిందో తెలుసుకునేలా లేదు కాబట్టి, ప్రస్తుతానికి ఈ మరణం వెనుక ఏ కుట్రా లేదని పోలీసులు ఆఫ్ రికార్డ్‌గా చెప్తున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీమ్ ఓ పదిరోజుల్లో పోస్ట్ మార్టమ్ నివేదిక ఇవ్వబోతోంది శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేసి అసలు నిజమేదో బయటపెడతామని అంటోంది. నిజంగా అలా జరుగుతుందా..?

జార్జ్ ముత్తూట్ ఫైనాన్స్ ని రెండంకెల సంఖ్యలో ఉన్న కార్యాలయాలను దేశవ్యాప్తంగా 5550 బ్రాంచ్‌లకు పెంచారు. గత ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో ముత్తూట్ లోన్స్ విలువ రూ.56వేల కోట్లుగా అంచనా సంస్థ ఆదాయం 6300కోట్లకాగా, ఆస్తులు 54వేలకోట్లపై మాటే.జార్జ్ ముత్తూట్ తండ్రి ఈ వ్యాపారాన్ని ప్రారంభించగా, తర్వాత దాయాదులు విడిపోయి ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశించారు. అది కూడా ముత్తూట్ పేరుతో ముత్తూట్ పప్పచ్చన్ పేరిట వ్యాపారం చేసుకుంటున్నారు. అంతేకాదు ముత్తూట్ ఫిన్‌కార్ప్ కూడా వాళ్లదే. , జార్జ్ ముత్తూట్ గోల్డ్ లోన్స్ ,రియల్ఎస్టేట్ ఇతరత్రా బిజినెస్‌లో మొగల్‌గా ఎదిగారు. ఐతే ఈ కుటుంబమంతా కూడా ఢిల్లీలోనే గత ముఫ్పైఏళ్లుగా నివసిస్తోంది. కేరళ చర్చ్ మాఫియాతో కూడా జార్జ్ ముత్తూట్ ఫ్యామిలీకీ విబేధాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తుంటుంది. ప్రస్తుతం ముత్తూట్ ఫైనాన్స్ ఎండి మరణం ఆయన రెండో కుమారుడి మరణం వెనుక మిస్టరీని మరోసారి గుర్తు చేయడంతో పాటు ఈ రెండు కేసుల వెనుక వ్యక్తిగత పగ,వ్యాపారాల మధ్య వైరం కోణం కూడా ఉందనే అనుమానాలు బలపడుతున్నాయ్. వాటికి మరి ఎయిమ్స్ రిపోర్ట్ ఫుల్‌స్టాప్ పెట్టగలదా..?

ALSO WATCH : Profit Your Trade


Tags

Read MoreRead Less
Next Story