NIA : గ్యాంగ్ స్టర్లపై దేశవ్యాప్తంగా NIA దాడులు

NIA : గ్యాంగ్ స్టర్లపై దేశవ్యాప్తంగా NIA దాడులు
గ్యాంగ్ స్టర్ - టెర్రరిస్ట్ అణచివేతలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ - ఎన్సీఆర్ లలో దాడులు జరుగుతున్నాయి

దేశవ్యాప్తంగా 72 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్ స్టర్ - టెర్రరిస్ట్ అణచివేతలో భాగంగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ - ఎన్సీఆర్ లలో దాడులు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ పిలిభిత్ లో ఆయుధాల సరఫరా జరుగుతున్నాయన్న సమాచారంతో, పలు ఇళ్లపై దాడులు ముమ్మరమయ్యాయి. ఈ దాడులలో పాకిస్థాన్ నుండి సరఫరా చేయబడిన ఆయుధాలు కనుగొనబడ్డాయి.

లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా గ్యాంగ్ లోని గ్యాంగ్ స్టర్లను ఎన్ఐఏ విచారించినప్పుడు, సేకరించిన సమాచారం ఆదారంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన దాడుల్లో పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ లో ఉగ్రవాదులు, గ్యాంగ్ స్టర్లకు మధ్య ఆయుధాల అక్రమ రవాణా జరిగిందని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఆయా గ్యాంగ్ స్టర్ల నెట్ వర్క్ పై నిఘా ఉంచి దాడులు చేస్తున్నట్లు ఎన్ఐఏ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story