Schools Reopen: ఆకతాయిల ఆగడాలు.. గదులు ఓపెన్ చేసి చూస్తే..

Nalgonda: యాదాద్రిలోని ప్రభుత్వ పాఠశాల గదుల్లో ఆకతాయిల ఆగడాలు తెలుసుకుని అధికారులు నివ్వెరపోతున్నారు.

Schools Reopen: ఆకతాయిల ఆగడాలు.. గదులు ఓపెన్ చేసి చూస్తే..
X

యాదాద్రిలోని ప్రభుత్వ పాఠశాల గదుల్లో ఆకతాయిల ఆగడాలు తెలుసుకుని... అధికారులు నివ్వెరపోతున్నారు. స్కూళ్ల రీఓపెన్‌ కోసం సిద్ధం చేస్తుండగా... ఇన్నాళ్లు తరగతి గదుల్లో జరిగిన దారుణాలు, పాడు పనులు బయట పడుతున్నాయి. కరోనా కారణంగా స్కూళ్లు మూసివేయడంతో... ఆకతాయిలు... స్కూళ్లను బార్లు, లాడ్జీలుగా మార్చేశారు. సెప్టెంబర్‌ 1న స్కూళ్లు రీఓపెన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు స్కూళ్లను రీఓపెన్‌ కోసం సిద్ధం చేస్తుండగా... గదుల్లో ఎక్కడ చూసినా మద్యం సీసాలు, సిగరెట్, కండోమ్‌ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. యాదాద్రిలోని లాడ్జిలపై పోలీసులు నిఘా పెంచడంతో.... మూతపడిన స్కూళ్లపై ఆకతాయిలు కన్నేశారు. మద్యపానం, వ్యభిచారానికి అడ్డాగా మార్చుకున్నారు.

Next Story

RELATED STORIES