హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ అంటూ మందు ఇచ్చి బంగారం అపహరించిన నర్స్

కరోనా వ్యాక్సిన్ అంటూ మత్తు మందు ఇచ్చింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఒంటిపై ఉన్నబంగారం అపహరించుకుపోయింది.

హైదరాబాద్‌లో కరోనా వ్యాక్సిన్ అంటూ మందు ఇచ్చి బంగారం అపహరించిన నర్స్
X

హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ నర్స్.. కరోనా వాక్సిన్ పేరుతో వృద్ధ దంపతులను మోసం చేసింది. మీర్ పేట్ పరిధిలోని లలితానరగ్ లో కరోనా వ్యాక్సిన్ అంటూ మత్తు మందు ఇచ్చింది. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఒంటిపై ఉన్న ఎనిమిది తులాల బంగారం అపహరించుకుపోయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇంతకు ముందు కూడా వృద్ధదంపతులకు పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చింది. అయితే వారికి షుగర్ ఉండడంతో దానిని తినలేదు. దీంతో కరోనా వ్యాక్సిన్ అంటూ స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది.


Next Story

RELATED STORIES