Panjagutta: శవంతో బెంగళూరు నుండి హైదరాబాద్‌కు.. పంజాగుట్ట బాలిక హత్య కేసులో బయటపడతున్న నిజాలు..

Panjagutta (tv5news.in)

Panjagutta (tv5news.in)

Panjagutta: పంజాగుట్ట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. కేసులో చిన్నారి తల్లి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

Panjagutta: హైదరాబాద్ పంజాగుట్ట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. కేసులో చిన్నారి తల్లి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని కన్న తల్లే కుమార్తెను హత్య చేసినట్లు విచారణలో తేలిందని చెప్పారు పోలీసులు. రాజస్థాన్ లో అజ్మీర్ లో నిందితులు హీనాబేగం, ఆమె ప్రియుడు షేక్ మహమ్మద్ ఖాదర్ ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

పంజాగుట్ట ద్వారకాపురిలోని ఒక దుకాణం ముందు 8 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో బాలిక డెడ్ బాడీ కనిపించింది. ఘటనా స్థలానికి కొంత దూరంలో లభించిన కీలక ఆధారంత ోనిందితులను గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ పోలీసులను కూడా సంప్రదించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారం దొరికింది. నిందితులు అజ్మీర్‌లో ఉన్నారని గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.

బాలిక తల్లి హీనాబేగంది మియాపూర్ కాగా..ఆమె ప్రియుడు ఖాదర్‌ది డబీర్ పురా అని చెప్పారు పోలీసులు. షేక్ పేట్ లో హీనాబేగం..ఖాదర్ మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. పిల్లలను తీసుకుని ఇద్దరు ముంబై, ఢిల్లీ, జైపూర్ , మనాలి వెళ్లారు. అక్కడ పిల్లలతో భిక్షాటన చేయించినట్లు చెప్పారు పోలీసులు.

బేబి మెహక్ అనే చిన్నారి బెగ్గింగ్ చేసేందుకు నిరాకరించడంతో దారుణంగా కొట్టి చంపినట్లు పోలీసులు చెప్పారు. తర్వాత చిన్నారి డెడ్ బాడీని బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి పంజాగుట్ట ద్వారకపురి కాలనీలో షాపు వద్ద వదిలి పెట్టారని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరిని రిమాండ్ కు పంపినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story