సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చాకచక్యంగా చేధించిన గుంటూరు పోలీసులు

సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చాకచక్యంగా చేధించిన గుంటూరు పోలీసులు
X

సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును గుంటూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా చేధించారు. లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ నుంచి సెల్‌ఫోన్లు చోరీ చేసింది మహారాష్ట్రకు చెందిన కంజర భట్ ముఠా పనిగా పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి 862 సెల్‌ఫోన్లు, 4.5 లక్షలు రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

అలాగే మెదక్ జిల్లా చేగుంటలో మరో చోరీకి సంబంధించిన సొత్తు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2.36 కోట్ల రూపాయల విలువైన 18 వందల 26 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరానికి వినియోగించిన లారీ, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీలో 11 మంది ముఠా సభ్యులు ఉన్నారని.. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.

Next Story

RELATED STORIES