మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారణం మహ్మద్‌ సైఫ్‌

మెడికో ప్రీతి ఆత్మహత్యకు కారణం మహ్మద్‌ సైఫ్‌
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్యకు.. సీనియర్‌ విద్యార్థి మహ్మద్‌ సైఫ్‌ వేధింపులే కారణమని వరంగల్‌ పోలీసులు నిర్ధారించారు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్యకు.. సీనియర్‌ విద్యార్థి మహ్మద్‌ సైఫ్‌ వేధింపులే కారణమని వరంగల్‌ పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి.. ఆమె చదువుతున్న కళాశాలకు సంబంధించిన వ్యక్తులతో పాటు ప్రీతి రూమ్‌మేట్స్‌, స్నేహితులు, సిబ్బంది, క్లాస్‌మేట్స్‌ నుంచి పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. 70 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించారు.

970 పేజీల చార్జిషీటును వరంగల్‌ జిల్లా కోర్టుకు సమర్పించినట్టు వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌ తెలిపారు. ఎల్‌డీడీ, నాకౌట్‌ పేరిట రెండు వాట్సాప్‌ గ్రూపులను క్రియేట్‌ చేసి, ఆ వాట్సాప్‌ గ్రూపుల్లో.. ప్రీతిపై తరుచుగా విమర్శలు, వేధింపులు చేస్తూ కామెంట్స్‌ పెట్టేవాడు సైఫ్. వేధింపులు తట్టుకోలేక ఫిబ్రవరి 22న ఎంజీఎంలోని అనస్తీషియా విభా గం గదిలో ఆత్మహత్యాయత్నం చేసింది ప్రీతి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించగా ఫిబ్రవరి 26న కన్నుమూసింది ప్రీతి.

Tags

Read MoreRead Less
Next Story