Shilpa Chowdary: శిల్పా చౌదరిని అదుపులోకి తీసుకోనున్న పోలీసులు

Shilpa Chowdary: శిల్పా చౌదరిని అదుపులోకి తీసుకోనున్న పోలీసులు
Shilpa Chowdary: కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసి మహిళల నుంచి డబ్బులు వసూలు చేసేది. టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోలను మాయ మాటలతో బుట్టలో వేసుకునేది.

వ్యాపారవేత్త శిల్పా చౌదరిని కాసేపట్లో అదుపులోకి తీసుకోనున్నారు. అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్లు రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో.. శిల్పను రెండు రోజుల కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతిచ్చింది. ఇవాళ, రేపు ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఎంత మంది ఆమె చేతిలో మోసపోయారు..? శిల్ప వెనుక ఎవరెవరి హస్తాలున్నాయనే కోణంలో విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసి... మహిళల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. శిల్ప ఇచ్చే స్టేట్‌మెంట్‌తో మొత్తం డొంక కదలనుంది.

Tags

Read MoreRead Less
Next Story