గుంటూరులో దారుణం.. పసిబాలుడిపై సైకో లైంగికదాడి

చిన్నారి భార్గవ్ తేజ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

గుంటూరులో దారుణం.. పసిబాలుడిపై సైకో లైంగికదాడి
X

గుంటూరు జిల్లా మెల్లంపూడిలో జరిగిన చిన్నారి భార్గవ్ తేజ్ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. గోపి అనే యువకుడు బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. భార్గవ్ తేజ్‌పై లైంగిక దాడి చేసేందుకు నిందితుడు గోపి ప్రయత్నించగా.. బాలుడు ప్రతిఘటించాడు. దీంతో బాలుడి చేతులు, కాళ్లుకట్టేసి అఘాయిత్యానికి పాల్పడి.. విషయం భయటకు పొక్కకుండా బాలుడిని హత్యచేసినట్లు పోలీసులు వివరించారు.

మెల్లంపూడి గ్రామంలో ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న కుర్ర భార్గవతేజ ఉన్నట్టుంది అదృశ్యం అయ్యాడు. దీంతో బాలుడి ఆచూకి కోసం చుట్టుపక్కల వెతికిన అతడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఎవరికి అనుమానం రాకుండా అదే గ్రామానికిచెందిన నిందితుడు గోపయ్య, అలియాస్ గోపి.. బాలుడి కుటుంబ సభ్యులతోపాటు భార్గవ తేజ్ కోసం వెతుకుతున్నట్లు నటించాడు. యువకుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. బాలుడిని తానే చంపినట్లు అంగీకరించాడు. బాలుడిపై లైంగికదాడి చేసి హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం డెడ్ బాడీని అరటి తోటలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

మెల్లంపూడి, వడ్డేశ్వర గ్రామాల్లో నెలరోజుల వ్యవధిలో ఇద్దరు బాలుడు అదృశ్యం కావడంపై పోలీసులు దృష్టిసారించారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముమ్మరంగా దర్యాప్తుచేయడంతో గోపి బాలురపై జరుపుతున్న అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 11వ తేదీన వడ్డేశ్వర గ్రామానికిచెందిన 8 ఏళ్ల బండి అఖిల్ ను కూడా భార్గవ్ తేజ తరహాలోనే మాయమాటలు చెప్పి.. వెంట తీసుకెళ్లి లైంగిక వాంఛతీర్చుకొని హతమార్చినట్లు నిందితుడు గోపి వెల్లడించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు గోపిలో సైకో స్వభావం చిన్నప్పటినుంచే ఉన్నట్లు స్థానికులు చెపుతున్నారు. అతడు పదేళ్లక్రితమే తన స్నేహితుడిని ఇదే తరహాలో హతమార్చినట్లు అంటున్నారు. అయితే అప్పట్లో గోపి భవిష్యత్ నాశనం అవుతుందని అప్పట్లో కొందరు పెద్దమనుషులు కేసు కాకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. అయితే తమ కుమారుడిని అత్యంత పాశవికంగా హతమార్చిన సైకో కిల్లర్ గోపిని కఠినంగా శిక్షించాలని భార్గవ్ తేజ్ తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES