ఈ పాము ధర తెలిస్తే షాక్.. అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి రేర్ స్నేక్..

Rare Snake Sells

Snake file Photo

Uttar Pradesh: ఓ అరుదైన జాతికి చెందిన పామును అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు కొందరూ కేటుగాళ్లు.

Uttar Pradesh: ఓ అరుదైన జాతికి చెందిన పామును అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు కొందరూ కేటుగాళ్లు. అయితే ఆ పాము ధర ఏ వెయ్యి, రెండు వేలు కాదు, ఏకంగా రూ.2.5 కోట్లు. ఆశ్చర్యపోతున్నారా? దీని ధర అంత ఎక్కువ.. ఎందుకంటే ఇది చాలా అరుదైన రెడ్ శాండ్ బోవా స్నేక్. ఈ పామును అంతర్జాతీయ మార్కెట్లో రహస్యంగా అమ్మడానికి ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ఖేరీ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తులు దుధ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ పామును అమ్మకానికి పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న వారు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.

పోలీసులు అరెస్టు చేసిన దొంగలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. తాము గతంలో కూడా ఇలాంటివి చేశామని ఒప్పుకున్నారు. ఇప్పటి వరకూ కనీసం 6 పాములను ఇలా అంతర్జాతీయ మార్కెట్లో అమ్మేసినట్లు చెప్పారు. దుధ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో ఈ పాములు కనిపిస్తాయని తెలిపారు. వీరి వద్ద నుంచి నాలుగు కేజీల బరువున్న అరుదైన రెడ్ శాండ్ బోవా రకం పాము మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దుధ్వా టైగర్ రిజర్వ్ సమీపంలో అరుదైన స్నేక్స్ కనిపిస్తాయి. దీంతో దుండగులు పాములు పట్టి అమ్మడం ప్రారంచేవారు. పామును అమ్మకానికి పెట్టిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరే కాకుండా ఇలాంటి వారు ఎందరు ఉన్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ పాము దొంగలపై వైల్డ్‌లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story