Dating Game Killer: మనిషి కాదు.. మానవ మృగం..130 మంది మహిళలపై..

Dating Game Killer: మనిషి కాదు.. మానవ మృగం..130 మంది మహిళలపై..
ఉరిశిక్షకోసం ఎదురు చూస్తూ ఊచలు లెక్కపెడుతున్నాడు. గత చరిత్ర ఘనకార్యాలను తలుచుకుంటూ కన్నుమూశాడు.

Dating Game Killer: కాలిఫోర్నియాలోని శాన్ జోక్విన్ వ్యాలీలోని ఒక ఆసుపత్రిలో అతను సహజ కారణాలతో మరణించాడని జైలు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న సమయంలో "ది డేటింగ్ గేమ్ కిల్లర్" గా పిలువబడే సీరియల్ టార్చర్-స్లేయర్ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.

1977 మరియు 1979 మధ్య కాలిఫోర్నియాలో ఐదు హత్యలకు కారణమైన అల్కాలాకు 2010 లో మరణ శిక్ష విధించబడింది. అతడి కబంధ హస్తాల్లో 12 ఏళ్ల బాలిక కూడా చిక్కుకుంది. అయితే అతడు దేశవ్యాప్తంగా 130 మందిని చంపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

1977 లో 28 ఏళ్ల మహిళ ఆల్కాలా అకృత్యాలకు బలైంది. డిఎన్ఎ ఆధారాలతో 2016 లో అతనిపై మళ్లీ అభియోగాలు చోటు చేసుకున్నాయి.

ఆల్కాలా మహిళలను వేటాడే ఓ మానవమృగంగా న్యాయవాదులు అభివర్ణిస్తారు. అతడి కన్ను పడ్డ ప్రతి మహిళను బలత్కరించేవాడు. వ్యతిరేకిస్తే వారిని సుత్తితో బాదేవాడు. స్పృహకోల్పోయి పడిపోతే వదిలేసే వాడు. తెలివి వచ్చిన తరువాత మళ్లీ టార్చర్ పెట్టేవాడు. అతడి పైశాచిక ఆనందం తీరాక బాధితుల నుండి చెవిపోగులను తీసుకునేవాడు.

అతని నిజమైన బాధితుల సంఖ్య ఎప్పటికీ తెలియకపోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

1978లో ది డేటింగ్ గేమ్ టీవీ షోలో పాల్గొని విజేతగా నిలిచాడు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడే ముందు ఫోటోలు తీసే అలవాటున్న అల్కాలా ఆషోలో తనను తాను ఫోటోగ్రాఫర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ షోతోనే అతడికి డేటింగ్ గేమ్ కిల్లర్‌గా పేరొచ్చింది.

న్యూయార్క్‌లో జరిగిన రెండు నరహత్యలకు నేరాన్ని అంగీకరించిన తరువాత 2013 లో ఆల్కాలాకు 25 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. గావిన్ న్యూసోమ్ గవర్నర్‌గా ఉన్నంతవరకు మరణశిక్షలపై తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ.. అతడి అకృత్యాలకు చెవిపోగులు సాక్ష్యాలుగా మిగలడంతో ఆల్కాలాకు మరణశిక్ష విధించటానికి సహాయపడ్డాయి. అతడి ఇంటిలో లభించిన 100కు పైగా ఉన్న మహిళల ఫొటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు. శిక్షలో భాగంగా జైలులో ఉన్న అల్కాలా స్వల్ప అస్వస్థతతో అస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ అక్కడే కన్నుమూశాడు.

Tags

Read MoreRead Less
Next Story