ప్చ్.. టైమ్ బాలేదు.. బొమ్మ తుపాకీతో బెదిరించినందుకే 30 ఏళ్లు జైల్లో పెట్టి..

ప్చ్.. టైమ్ బాలేదు.. బొమ్మ తుపాకీతో బెదిరించినందుకే 30 ఏళ్లు జైల్లో పెట్టి..
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. 70 ఏళ్ల వయసున్న రోల్స్ కయెస్టెల్.. ఆర్కన్‌సన్ రాష్ట్రంలో 30 ఏళ్ల క్రితం ఓ ఫుడ్ కోర్ట్‌లో దొంగతనానికి పాల్పడ్డాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు అడిగాడు. తుపాకీ చూసి భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి రోల్స్ అడిగినంత డబ్బు ఇచ్చేశాడు.

దొంగ వెళ్లి పోయిన తరువాత షాపు యజమానికి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించారు. తాను బొమ్మ తుపాకీతో భయపెట్టి డబ్బులు దోచుకున్నానని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతడికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. ఇక అప్పటి నుంచి తాను చేసింది చాలా చిన్న తప్పు అని క్షమాభిక్ష పెట్టమని కోర్టు వారిని అభ్యర్ధిస్తూనే ఉన్నాడు.

అతడి చేతిలో దోపిడీకి గురైన వ్యక్తి కూడా క్షమించి వదిలేయమని విజ్ఞప్తి చేశాడు. కానీ రోల్స్ ఐదుసార్లు క్షమాభిక్షకు అప్పీల్ చేసుకున్నా కోర్టు తిరస్కరించింది. సెలబ్రెటీలు సైతం అతడిని విడుదల చేయమని కోరారు. ఎట్టకేలకు ఐదోసారి అతడికి క్షమాభిక్ష దొరికింది. కానీ అప్పటికే రోల్స్ జీవితం జైల్లోనే 30 ఏళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం ఇంకో పదేళ్లు ఉందనగా క్షమాభిక్ష దొరికింది.

అయితే అతడిని విడుదల చేయాలంటే మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పింది కోర్టు. 30 ఏళ్లు గడిపాను 30 రోజులు ఒక లెక్కా అని రోల్స్ వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే అతడి విడుదలకు గవర్నర్ అసా హచిన్‌సన్ ఆమోద ముద్ర కూడా లభించాల్సి ఉంది.

ఖైదీగా ఉన్న సమయంలో కైస్టెల్ జైలు నిబంధనలను ఎప్పుడూ ఉల్లంఘించలేదు మరియు జైలులో ఉన్నప్పుడు అతను మూడు అసోసియేట్ డిగ్రీలను సంపాదించాడు. ఇంతకీ అతడు తుపాకీతో బెదిరించి దోచుకున్న సొమ్ము 264 డాలర్లు (మన ఇండియన్ కరెన్సీలో రూ. 20,000).

Tags

Read MoreRead Less
Next Story