ఔరా.. ఎంత మోసం.. తక్కువ ధరకి కోడిగుడ్లు అంటూ.. నేలకేసి కొట్టినా...!

మార్కెట్‌లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో రోజుకో వస్తువు నకిలీ రూపంలో బయటికి వస్తుంది.

ఔరా.. ఎంత మోసం.. తక్కువ ధరకి కోడిగుడ్లు అంటూ..  నేలకేసి కొట్టినా...!
X

మార్కెట్‌లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. దీంతో రోజుకో వస్తువు నకిలీ రూపంలో బయటికి వస్తుంది. ఇన్నాళ్లూ ప్లాస్టిక్‌ బియ్యం గురించి విన్నాం. ఇప్పుడు ప్లాస్టిక్‌ గుడ్లు కూడా వెలుగు చూశాయి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు గ్రామంలోని అండ్రావారి పల్లిలో ఓ వ్యాపారి ఆటోలో గుడ్లు అమ్మేందుకు వచ్చాడు. గుడ్ల అట్టపెట్టె 130 రూపాయలకే ఇస్తుండటంతో జనం భారీగా కొనుగోలు చేశారు. ఇక మహిళలు కొన్ని గుడ్లు ఉడకబెట్టగా అవి ఉడక లేదు. అనుమానం వచ్చి వలుస్తుండగా పొక్కు సాగడం మొదలైంది. దీంతో మిగతా గుడ్లు నేలకేసి కొట్టగా అవి పగలలేదు. వాసన కూడా రాలేదు. రబ్బర్‌లా సాగుతుండటంతో ఇవి నకిలీవని తేలింది. దీంతో అవాక్కవడం స్థానికులవంతైంది.

Next Story

RELATED STORIES