Shilpa Chowdary: శిల్పా చౌదరి కేసులో కొత్త అప్డేట్స్.. విచారణలో..

Shilpa Chowdary (tv5news.in)

Shilpa Chowdary (tv5news.in)

Shilpa Chowdary: కిట్టి పార్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి విచారణ రెండవరోజు ముగిసింది.

Shilpa Chowdary: కిట్టి పార్టీల పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి మోసం చేసిన కేసులో శిల్పా చౌదరి విచారణ రెండవరోజు ముగిసింది. విచారణలో రాధికారెడ్డి పాత్ర తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. అధిక వడ్డీ ఆశతో 6 కోట్ల రూపాయలను రాధికకు అప్పుగా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాక గండిపేటలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కిట్టిపార్టీ ల పేరుతో ప్రముఖులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరిని రెండోరోజు నార్సింగ్ పోలీసులు విచారించారు. కస్టడీలో ఆమె స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. గండిపేటలోని శిల్పా నివాసం సిగ్నేచర్ విల్లాకు ఆమెను పోలీసులు తీసుకెళ్లారు. ఆధారాల సేకరణకు శిల్పాచౌదరి ఇంట్లో పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. మీడియా కంటపడకుండా రహస్యంగా పోలీసుల విచారణ చేశారు.

అనంతరం రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లి కోర్టులో ఆమెను హజరుపర్చారు. శిల్పాచౌదరి పోలీస్‌ కస్టడీ ముగిసినా.. మరో రెండు కేసులకు సంబంధించి ఆమెను తిరిగి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కీలకమైన ఆధారాలను నార్సింగి పోలీసులు సేకరించారు.కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పాచౌదరి.. పోలీసు విచారణలో తన డాబూ.. దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్భాల్లో కంటతడి పెట్టారు.

న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. మొదటి రోజు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్‌లోని స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారులు-- నార్సింగ్‌ ఇన్‌స్పెక్టర్‌, అదనపు ఇన్‌స్పెక్టర్‌-- మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు.

కస్టడీ ఫిటిషన్ పై నార్సింగి ఎస్వొటీ ఆఫీస్ లో రెండో రోజు విచారణ చేశారు పోలీసులు. ఈ విచారణలో ఆమె రాధికారెడ్డికి 6 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు గుర్తించారు. కాగా శిల్ప నుంచి డబ్బులు తీసుకున్న రాధికా రెడ్డి.. ఆడబ్బులు తిరిగిఇవ్వలేదన్నట్లు గుర్తించారు. ఇక తన దగ్గరకు వచ్చిన ప్రముఖులంతా... బ్లాక్ మనీని ఇన్వెస్ట్ మెంట్లు ద్వారా వైట్ గా మార్చేందుకే డబ్బులు ఇచ్చినట్లు శిల్పా వెల్లడించింది. ఈ డబ్బుకు అధిక వడ్డీలకు ఇస్తున్నట్లు తెలిపింది.

సెలబ్రెటీలు, వ్యాపారస్తుల ద్వారా ఎక్కువ మొత్తంలో శిల్పా చౌదరి వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల యువ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఆమెపై ఫిర్యాదు చేశారు. 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని, తిరిగి ఇవ్వలేదని పోలీసులకు తెలిపింది. సహెరీ సినిమా హీరో హర్ష కనుమల్లి సైతం.. శిల్పా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులతో మూడు కోట్లు మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Tags

Read MoreRead Less
Next Story