టీవీ సీరియల్ నటి ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు..

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య కేసులో విచారణ సాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. సాయికృష్ణ చేసిన అకృత్యాలు..

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు..
X

టీవీ సీరియల్ నటి ఆత్మహత్య కేసులో విచారణ సాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. సాయికృష్ణ చేసిన అకృత్యాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొడుతున్నారని.. దేవరాజ్‌తో శ్రావణి మాట్లాడిన ఆడియో టేపులు కూడా బయటికి వచ్చాయి. తన చావుకు సాయి కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడింది. విచారణలో భాగంగా సాయి పాత్రపై.. దేవరాజ్‌ సంచలన విషయాలు బయటపెట్టాడు. దీంతో గతంలో దేవరాజ్‌ను సాయి రక్తం వచ్చేలా కొట్టిన సాక్ష్యాలు వెలికితీశారు. కృష్ణానగర్‌లో సాయి అమ్మాయిల్ని ట్రాప్‌ చేసేవాడని దేవరాజ్ ఆరోపించినట్టు తెలుస్తోంది. అలాగే.. శ్రావణిని కూడా ట్రాప్ చేశాడని దేవరాజ్‌ ఆరోపిస్తున్నాడు. దేవరాజ్‌తో విడిపోవాలంటూ శ్రావణికి సాయి వేధించినట్టు సమాచారం. వేధింపులు తాళలేక శ్రావణి... ఆత్మహత్య చేసుకున్నట్టు.. ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Next Story

RELATED STORIES