మద్యానికి డబ్బులివ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు

మద్యానికి డబ్బులివ్వలేదని కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు
X

నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే కడతేర్చాడు కసాయి కొడుకు. తాగడానికి డబ్బులివ్వలేదని తల్లి చంద్రమ్మతో కొడుకు రాముడు గొడవకు దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రాముడు.. తల్లి తల నరికి అక్కడి నుంచి తలతో పాటు పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాముడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES