పదే పదే చదువుకోమంటూ విసిగిస్తోందని కరాటే బెల్ట్‌తో అమ్మని..

అమ్మకేవో ఆశలు.. కూతురు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలని.. కానీ అదే ఆమె పాలిట శాపమైంది.

పదే పదే చదువుకోమంటూ విసిగిస్తోందని కరాటే బెల్ట్‌తో అమ్మని..
X

అమ్మకేవో ఆశలు.. కూతురు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలని.. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. చదువుకోమని విసిగిస్తున్న తల్లిని చంపి కూతురు హంతకురాలయ్యింది.

నవీ ముంబైలో 15 ఏళ్ల బాలిక కరాటే బెల్ట్‌తో తన తల్లి మెడను బిగించి హత్య చేసింది. ఆమె తల్లిని హత్య చేయడంతో పాటు, అది ప్రమాదవశాత్తు మరణంగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించింది. బాలిక తన విద్యకు సంబంధించి తల్లిని హత్య చేసిందని పోలీసులు తెలిపారు. నవీ ముంబైలోని ఐరోలిలో జూన్ 30 న జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

తల్లి తన కూతురును డాక్టర్ చేయాలనుకుంది. కానీ కూతురుకు డాక్టర్ చదువు ఇష్టం లేదు. ఇదే విషయం మీద తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో, తల్లిపై ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూతురు. అయితే పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

కానీ అంతలోనే జూలై 30 న, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, నా తల్లి పడిపోయి చనిపోయిందని చెప్పింది. అనంతరం తల్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. వాస్తవానికి, ఆమె సహజంగా చనిపోలేదని పోలీసులు గుర్తించారు. అనుమానంతో కూతురుని విచారించగా అసలు విషయం చెప్పింది. కరాటే బెల్టుతో తన తల్లి గొంతు కోసి చంపినట్లు ఆమె అంగీకరించింది. బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES