తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా..

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేసేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.

తహసీల్దార్ సంతకం ఫోర్జరీ.. ఆరు కోట్ల విలువైన స్థలం కబ్జా..
X

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీ చేసి కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేసేందుకు యత్నించిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు గచ్చిబౌలి పోలీసులు. పోలీసుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ సర్వే నెంబర్ 27 గల ప్రభుత్వ స్థలానకి జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ లో అక్రమ మార్గాన ఇంటి నెంబర్ తీసుకుని, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి NOC సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సంగం రాజుగౌడ్‌(46) కొమరగొని శ్రీనివాస్‌గౌడ్‌(36) ఈశ్వర్‌గౌడ్‌(52), సారయ్య అనే వ్యక్తులు . అంతేకాకుండా ఆ స్థలంలో భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకొని నిర్మాణం ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు భవన నిర్మాణాన్ని కూల్చివేశారు. స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దీనితో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వంశీమోహన్‌ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES