నా భార్య మిస్సింగ్.. నా భర్త కూడా మిస్సింగ్.. పోలీసులకి దిమ్మతిరిగే కంప్లైంట్

నా భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త వచ్చి పొలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకి అతడి భార్యతో నా భర్త వెళ్లాడంటూ ఓ మహిళ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నా భార్య మిస్సింగ్.. నా భర్త కూడా మిస్సింగ్.. పోలీసులకి దిమ్మతిరిగే కంప్లైంట్
X

నా భార్య కనిపించడం లేదంటూ ఓ భర్త వచ్చి పొలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన కొద్ది నిమిషాలకి అతడి భార్యతో నా భర్త వెళ్లాడంటూ ఓ మహిళ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్రమైన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన బి.నారాయణదాస్, మోనికా దాస్‌ దంపతులు.. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వచ్చారు. ఇక్కడ నారాయణదాస్‌ ప్లంబర్‌గా పని చేస్తుంటాడు.

అయితే గత కొంతకాలంగా మోనికా దాస్‌ ఫోన్‌లో ఎండీ ఆసిఫ్‌ అనే వ్యక్తితో తరచూ మాట్లాడుతున్న విషయాన్ని నారాయణదాస్‌ గమనించాడు. ఇలా చేయొద్దని పలుమార్లు మదలించాడు కూడా.. అంతేకాకుండా గొడవలు కూడా అయ్యేవి. పెద్ద మనుషులు సర్ది చెప్పడంతో మళ్ళీ కలిసుండేవారు. అయితే ఈ నెల 24న భర్త ఇంట్లో లేని సమయంలో మోనికా దాస్‌ తన ఇద్దరు పిల్లలను తీసుకొని కోల్‌కతా వెళ్లిపోయింది. అక్కడ తన తల్లిదగ్గర వదిలేసి వెళ్ళినట్లుగా వాకబు తెలిసింది.

తన భార్య ఎండీ ఆసిఫ్‌ తో వెళ్లినట్లుగా నారాయణదాస్‌ ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తన భర్త కనిపించడం లేదని, ఆసిఫ్‌ భార్య వచ్చి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో అవాక్కవడం పోలీసుల వంతు అయింది. రెండు మిస్సింగ్ కేసులుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES